ఒంటికి మట్టి బురద పూసుకోనే...ఐశ్వర్యా రాయ్
'మీరు స్నానం చేసి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒంటికి మట్టి ప్లస్ బురద పూసుకుని డర్టీగా తయారవ్వండి. వేసుకున్న బట్టలు కూడా బాగా నలపండి. పిచ్చి పిచ్చిగా..చిరిగిపోయినట్లుగా తయారు చేయండి. అప్పుడు షూటింగ్ లో పాల్గొనండి' అని చెప్పేవారు మణిరత్నం సార్ అంటోంది ఐశ్వర్యారాయ్. ఆమె మణిరత్న దర్శకత్వంలో చేస్తున్న రావణ్ గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లనే....హిందీ కోసం, తమిళ్ కోసం రెండుసార్లు ఆ గెటప్‌లో నటించాల్సివచ్చేది. ఒక వెర్షన్‌లో షూట్ అయిన తర్వాత రెండో వెర్షన్‌కి వెళ్తుండగా ఎఫెక్టివ్‌నెస్ తగ్గినట్లు ఫీలయితే మళ్ళీ వెళ్ళి వొంటికి బురద పూసుకుని రమ్మనే వారు మణిసార్. అలా ప్రతీ షాట్ ఓ మరిచిపోలేని అనుభూతి ఈ చిత్రానికి కలిగింది. ప్రతి చిన్న విషయంలోనూ మణిగారు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు' అని చెప్పారు. హిందీలో 'రావణ్'గా తెలుగులో 'విలన్'గా వస్తోన్న ఈ చిత్రంలో ఐష్, విక్రమ్, ప్రియమణి తదితరులు నటిస్తున్నారు. హిందీ వెర్షన్‌లో అభిషేక్ బచ్చన్ కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











