సిగెరెట్ వివాదంలో కళ్యాణ్ రామ్ హీరోయిన్
కత్తి సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించిన సనాఖాన్ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఓ విచిత్రమైన వివాదంలో చిక్కుకుంది. ఈ తమిళమ్మాయి ఈ మధ్య తను నటించిన తమిళ చిత్రం 'పయనం' (ప్రయాణం)లోని ఒక డైలాగ్‌తో చిన్న వివాదంలో ఇరుక్కుంది.
'స్మోక్ చేస్తే ఒకేసారి బరువు తగ్గడంతో పాటు ఒక ఊపిరితిత్తును కూడా నష్టపోతారు' అనే అర్థంతో సనా చెప్పిన డైలాగ్‌ను పలువురు తప్పుబట్టారు. పొగ తాగడాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నదా? అనే ప్రశ్నలు లేవనెత్తారు. దీని గురించి ఈ కొత్త నటిని అడిగినప్పుడు ఆ డైలాగ్‌ను వక్రీకరించడం గానీ, మొదటి సగభాగాన్నే (స్మోక్ చేస్తే ఒకేసారి బరువు తగ్గడం) పరిగణనలోకి తీసుకోవడం గానీ జరిగిందని, తాను స్మోకింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లుగా జనం భావించారని మదురైకి చెందిన ఈ ఇంటీరియర్ డిజైనర్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సనాఖాన్ మంచు మనోజ్ సరసన 'మిస్టర్ నోకియా'లో చేస్తోంది.


Click it and Unblock the Notifications











