ఆ హీరోకి స్పీచ్ లు రాసేది నేనే!!

By Staff

Rajinikanth
కె.బాలచందర్ రజనీకాంత్ కి గురువు అయితే,ఎస్.పి.ముత్తురామన్ అతన్ని సూపర్ స్టార్ గా నిలబెట్టిన దిగ్గజం. ఆయన ఈ మధ్యన చెన్నైలో జరిగిన రైజింగ్ స్టార్ అవార్డ్స్ ఫంక్షన్ లో మాట్లాడుతూ రజనీకాంత్ కి తాను స్పీచ్ రైటర్ నని ... ఇన్నాళ్ళూ స్టేజిపై మాట్లాడే మాటలన్నీ తాను రాసినవేనని ప్రకటించారు. అందులోనూ రజనీకి మైక్ ముందు మాట్లాడాలంటే సిగ్గని,ఎక్కువసేపు కంటిన్యూగా మాట్లాడటం కష్టమనీ చెబుతూ అందుకే తాను చాలా తక్కువ మేటర్ రాస్తానని,తక్కువ పదాలతో ఎక్కువ భావం ఉండాలంటాడని చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా అందరినీ మాట్లాడేటప్పుడు చాలా గౌరవించాలనీ దానికి తగ్గట్లే రాయమని కోరుతూంటాడని ఆయన అన్నారు. దాంతో ఇన్నాళ్ళుగా రజనీ స్పాంటినిటీగా రకరకాల అంశాలపై మాట్లాడటాన్ని ఆయన ప్రతిభ కాదన్న భావన తో అంతా చూసారు. ఇది గమినించిన ముత్తురామన్ వెంటనే సర్ధుకుని తాను కేవలం రైటర్ నేని ఆ స్పీచ్ లలో ఏం రాయాలో ఆయనే వివరంగా చెప్తూంటారని సరిచేసారు.దాంతో చిరంజీవిలా రజనీ పార్టీ పెట్టి ప్రచారంలోకి దిగితే ముత్తురామన్ ఫుల్ బిజీ అవుతారనీ కొందరన్నారు. ఇక మత్తురామన్ స్పీచ్ రైటర్ కళ ఇప్పుడు బయటపడిందికాబట్టి మరికొంతమంది రాజకీయనాయకులు ఆయన చేత రాయించుకునే అవకాశముందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X