ఆమె అంటే రజనీకి ప్రత్యేకమైన అభిమానం...!?
భాను చాలా టాలెంటెడ్. అందుకే తనంటే నాకు ఇష్టం అని ఈ మధ్య రజనీకాంత్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. ఎవరా భాను ఏమా కథ అనే విషయానికొస్తే..భాను అంటే మేకప్ వుమెన్, కోలివుడ్ లో చాలా ఫేమస్. ఆమె జ్యోతిక, సూర్య, త్రిష, విక్రమ్, నయనతార, అసిన్ వంటి చాలా మంది స్టార్లకు మేకప్ వుమెన్ గా పనిచేసి మంచి ప్రశంసలే పొందినది. అంతే కాదు 'శివాజీ" సినిమాలో రజనీకి మేకప్ చేసింది తనే ఆ సినిమాలో రజనీని గుండు గెటప్ లో అద్భుతంగా చూపించి, అభిమాను ప్లాట్ అయ్యేలా చేసింది కూడా భానూనే. ఇటీవల విడుదలైన 'రోబో" లో కూడా రజనీకాంత్ గెటప్ కు మేకప్ వేసింది తనే. 'రోబో" లో రజనీ గెటప్ కు వచ్చిన స్పందన గురించి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకి సైంటిస్ట్ గా, మంచి రోబోగా, చెడ్డ రోబోగా చక్కగా 3రకాలుగా మేకప్ చేసింది భాను. అందుకే ఆమె అంటే రజనీకి ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆ క్రెడిట్ అంతా ఆమె చెందుతుందని అభినందించారట.


Click it and Unblock the Notifications











