ఇద్దరయితేసారీ..ప్రియమణి
ప్రియమణి ఇప్పుడు తనను బుక్ చెయ్యాలంటే కొన్ని రూల్స్ పెడుతోంది. అందులో ముఖ్యంగా పరుత్తివీరన్ తరహా విలేజ్ గర్ల్ పాత్ర కాకూడదు. అలాగే ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాల్లో నేను ఒకదానిగా చేయను. ఇక బికినీ వేసి చేసాను కదా అన్నీ అలాంటి గ్లామర్ రోల్స్ తెస్తే చేయను. ఆ పాత్రలో జీవం ఉండాలి..నటించేందుకు స్కోప్ ఉండాలి...అంటోంది. అయితే ఈ రూల్స్ అన్నీ చిన్న నిర్మాతలకు, కొత్త వారికే నని తెలుస్తోంది. పెద్ద హీరో గానీ, దర్శకుడు కానీ డేట్స్ అడిగితే వేరే మాట అనకుండా ఈ రూల్స్ అన్ని ప్రక్కన పెడుతుందని లోపాయికారీగా చెప్తున్నారు. ఇక ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడటం వెనక కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ ని ప్రక్కన పెట్టడానికే అని తెలుస్తోంది. అలాగే ద్రోణ సినిమాలో బికినీ వేసినా వర్కవుట్ కాకపోవటం, మిత్రుడు అనుకున్నంత రేంజిలో వర్కవుట్ కాకపోవటం ఆమెను నిరాశపరిచిందని అంటున్నారు.
priyamani paruttiveran bikini drona media rules mithrudu nitin balakrishna ప్రియమణి బికినీ మిత్రుడు ద్రోణ పరుత్తివీరన్


Click it and Unblock the Notifications