మగాళ్ళను అలా పిలవబుద్దికాదు..నమిత

By Staff

సాధారణంగా ఆడవాళ్ళు చాలామంది మగాళ్ళంతా నాకు సోదర సమానులు అనే చెప్తూంటారు.అయితే నమిత ఇందుకు రివర్స్ లో బిహేవ్ చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వూలో నాకు మగాళ్ళు ఎవరూ సోదరులు కావు..అన్నా అని ఎవరిని పిలవటానికి ఇష్టపడను అయినా..మగవాళ్లంతా నాకు బాగా దగ్గరవాళ్లే...అని తెల్చి చెప్పింది. ఆమె చేస్తున్న జగన్మోహిని చిత్రంలో వడివేలు ఆమెకు అన్నగా చేస్తున్నాడు. ఆ విషయం ప్రస్దావిస్తూ...సీన్ ప్రకారం ఆయన్ని అన్నా అని పిలిచినా మిగతా సమయాల్లో సర్ అని సంభోదిస్తాను. నేను ఎవర్నీ బ్రదర్ అని పిలిచేదు లేదు అంటూ తెలిపింది.

జూనపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో విజయవంతమైన 'జగన్మోహిని' చిత్రానికి రీమేక్ గా నమిత 'జగన్మోహిని' రూపొందుతోంది. అప్పటి సినిమాని భారీ గ్రాఫిక్స్ జోడించి దర్శకుడు ఎన్.కె.విశ్వనాథన్ రూపొందిస్తున్నాడు. నిర్మాత హెచ్.మురళి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. రాజా, మీరాచోప్రా, నమితతో పాటు తమిళ హాస్యనట దిగ్గజాలైన వడివేలు, వెన్నెరాడై మూర్తి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

జగన్మోహిని చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలు చెన్నైలోని ఎఆర్ ఎస్ గార్డెన్స్ లో నమిత, వడివేలు తదితరులపై చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నమిత మీడియాతో మాట్లాడింది. అలాగే ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్ల సెంటిమెండ్ సన్నివేశాలకు బదులు కామెడీ సీన్స్ ఉండేలా చూడాల్సిందిగా నమిత దర్శకుడిని కోరానని చెప్పుకొచ్చింది. మగవాళ్లంతా నాకు దగ్గర వాళ్లుగానే అనుకుంటాను. ఇక పెళ్లి అంటారా? అందుకు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి గ్లామర్ ను కాపాడుకుంటూ అభిమానులను అలరించడమే నా లక్ష్యం అంది. ఏదైమైనా మగాళ్ళంతా సోదరులు కారు అని నిర్ణయం తీసుకున్నందకు ఆమె మగాభిమానులు సంతోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X