ఎక్స్ పోజింగ్ మీద నమ్మకం లేదు: తమన్నా
తెలుగులో 'శ్రీ "చిత్రం ద్వారా పరిచయమై 'హాపీ డేస్" చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హదయాలను దోచేసిన తమన్నాాది తమిళంలో ప్రత్యేక స్థానం. ఆమె నటించిన తమిళ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి, మరికొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు చిత్రాలకు మీరు దూరమయినట్టేనా అని తమన్నాాని అడిగితే 'నేను త్వరలోనే తెలుగు సినిమాలకు డేట్స్ ఇవ్వబోతున్నాను. ప్రస్తుతం నటిస్తున్న తమిళ సినిమాలు పూర్తయ్యే దిశలో ఉన్నాయి. వాటి తర్వాత తెలుగు సినిమాలకు డేట్స్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నాను.
నన్ను తెలుగు నిర్మాతలు అప్రోచ్ అవుతున్నారు. ఒక తెలుగు సినిమా రిజెక్ట్ చేసాను. కారణం ఆ సినిమాల్లో గ్లామర్ డాల్ గానే కనిపించాల్సి ఉంది. ఇది నాకు ఇష్టం లేదు. ఎక్స్ పోజింగ్ పై కూడా నమ్మకంలేదు. నటనకు ఇంపార్టెన్స్ ఉంటేనే నేను సినిమా ఒప్పుకుంటాను" అని చెప్పింది తమన్నా.
తమన్నా కొంచెం ఇష్టం కొంచెం కష్టం వీడొక్కడే సిద్దార్ద్ సూర్య tamanna koncham istam koncham kastam veedokkade siddharth surya


Click it and Unblock the Notifications