twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు.. పోర్న్ సైట్స్ వల్లే ఇదంతా, ఒక్కరోజులో అంతం!

    |

    హీరో విశాల్ వ్యతిరేకతతోనే తమిళ చలన చిత్ర నిర్మాతల మండలికి అధ్యాకుడిగా కొనసాగుతున్నాడు. తమిళ నిర్మాతల్లో ఓ వర్గంలో విశాల్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. నిర్మాతల మండలి నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలని విశాల్ ఎదుర్కొంటున్నారు. పైరసీని అరికట్టేందుకు విశాల్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి తమిళ నిర్మాతల్లో నెలకొని ఉంది. తాజాగా విశాల్ మీడియాతో మాట్లాడుతూ పైరసీ వెబ్ సైట్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

    సెటైర్లు పడుతున్నాయి

    సెటైర్లు పడుతున్నాయి

    ఇటీవల తమిళనిర్మాతలు చాలా మంది విశాల్ కు ఎదురు తిరిగినప్పుడు సంచలన ఆరోపణలు వినిపించాయి. ప్రముఖ పైరసీ వెబ్ సైట్ తమిళ్ రాక్సర్స్ లో విశాల్ భాగస్వామి అని కొందరు నిర్మాతలు ఆరోపించారు. ప్రముఖ దర్శకుడు వసంత బాలన్ ఇటీవల ఓ ఆడియో వేడుకలో విశాల్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టడం చేతకాదు కానీ ఇళయరాజా అభినందన సభ నిర్వహించడానికి బయలుదేరుతున్నారు అంటూ పరోక్షంగా విశాల్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

    నా ఒక్కడి వల్ల కాదు

    నా ఒక్కడి వల్ల కాదు

    దీని గురించి తాజాగా విశాల్ మీడియాతో మాట్లాడారు. పైరసీని అరికట్టడం నా ఒక్కడి వల్ల కాదు, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తలుచుకుంటే ఒక్కరోజులో తమిళ్ రాకర్స్, ఇతర పైరసీ వెబ్ సైట్స్ అంతు చూడవచ్చు అని విశాల్ తెలిపాడు. ఇది వరకే పరిసర సమస్య గురించి ప్రభుత్వానికి నివేదించినట్లు విశాల్ తెలిపాడు. మరోమారు కూడా ప్రభుత్వంతో పైరసీ ఎంత తీవ్రమైన సమస్యో వివరిస్తాం అని విశాల్ తెలిపాడు.

    పోర్న్ అంతం కావాలి

    పోర్న్ అంతం కావాలి

    తమిళ రాకర్స్, ఇతర పైరసీ వెబ్ సైట్స్ అంతం కావాలంటే ముందుగా పోర్న్ సైట్స్ అన్నింటిని బ్లాక్ చేయాలని విశాల్ తెలిపాడు. వాటిని అంతం చేసే శక్తి కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. కేంద్ర ప్రభత్వం త్వరలోనే దీనిపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు విశాల్ తెలిపాడు. వసంత బాలన్ వ్యాఖ్యలతో మరోమారు తమిళ చిత్ర పరిశ్రమలో పైరసీ గురించి చర్చ జరుగుతోంది.

    చిన్న చిత్రాలు దారుణంగా

    చిన్న చిత్రాలు దారుణంగా

    పైరసీ వలన చిన్న చిత్రాలు దారుణంగా నష్టపోతున్నాయని దర్శకుడు వసంత్ బాలన్ అన్నారు. తమిళ్ రాకర్స్ లో సినిమా దొరుకుతుంటే టికెట్ కొని థియేటర్ కు ఎవరు వెళతారు. అదీ చిన్న సినిమా అయితే బావున్నా వెళ్లరు. ఇది మనమంతా ఒప్పుకోవాల్సిన నిజం. పైరసీ సంస్థల్ని నిర్ములించేందుకు ఏ మేరకు చర్యలు జరుగుతున్నాయో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులుగా మనకు మనం ప్రశ్నించుకోవాలి అని వసంత్ బాలన్ అన్నారు.

    English summary
    If adult sites can be blocked, then Tamil Rockers can be eliminated: Vishal
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X