ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన కమల్.. సినిమాల్లో, రాజకీయాల్లో ఒకేసారి కొనసాగలేను.. శంకర్‌నే అడగండి!

Recommended Video

Kamal Haasan Says Sorry To His Fans. Why? || Filmibeat Telugu

స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రం సంచలన విజయం సాధించింది. శంకర్ దర్శత్వం, కమల్ హాసన్ డ్యూయెల్ రోల్ లో నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఇటీవల భారతీయుడు 2 చిత్రం సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రచారం కోసం కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ భవిష్యత్తులో సినిమాలు చేయడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరోసారి క్లారిటీ

మరోసారి క్లారిటీ

కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈ చిత్రం ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలని చిత్ర యూనిట్ ఖండించింది. తాజాగా కమల్ హాసన్ కూడా భారతీయుడు 2 ఆగిపోలేదంటూ క్లారిటీ ఇచ్చారు. చాలా రోజులుగా కమల్ హాసన్ నటించబోయే చివరి చిత్రం భారతీయుడు 2నే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శంకర్‌నే అడగండి

శంకర్‌నే అడగండి

భారతీయుడు 2 చిత్రం రాజకీయ అంశాలతో తెరకెక్కుతుందనే వార్తలపై కమల్ స్పందించారు. నేను ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్నా. నా మనసంతా ప్రజలపైనే ఉంది. ఈ చిత్రంలో రాజకీయ అంశాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నపై స్పందించాల్సింది నేను కాదు.. దర్శకుడు. కాబట్టి ఈ ప్రశ్న శంకర్ ని అడగండి అని కమల్ హాసన్ అన్నారు.

అభిమానులు క్షమించాలి

అభిమానులు క్షమించాలి

సినిమాల్లో, రాజకీయాల్లో రెండింటిలో కొనసాగే విషయంపై కమల్ మాట్లాడారు. అభిమానులంతా ప్రజా సేవ చేయాలని కోరుకుంటే సినిమాలు ఆపేస్తా. తాను సినిమాల్లో నటించాలని కోరుకునే వారికి ఇది నిరాశ కలిగించొచ్చు. అభిమానులంతా నన్ను క్షమించాలి. సినిమాల్లో, రాజకీయాల్లో ఒకేసారి కొనసాగలేను అని కమల్ అన్నారు. రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చాను కాబట్టి అని తొందరగా జరగాలి. నేను చేయాల్సింది చాలా ఉందంటూ కమల్ వ్యాఖ్యానించారు.

వృద్ధుడి గెటప్

వృద్ధుడి గెటప్

ఆ మధ్యన శంకర్ కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ.. దాదాపు 22 ఏళ్ల తర్వాత కమల్ భారతీయుడులోని వృద్ధుడి గెటప్ లో కనిపించారు. టెస్ట్ లుక్ కోసం ఫోటో షూట్ చేశా. కమల్ ని ఆ గెటప్ లో చూడగానే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని శంకర్ తెలిపారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X