తొక్కలో..నయనతార, తమన్నా
నాకూ వాళ్లకూ పోలికేంటి..అయినా మీరన్నట్లు నయనతార, తమన్నా బంగారాలైతే..నేను ప్లాటినం అంటోంది శ్రేయ.అదేంటి అని అడిగిన మీడియా వారికి తనకూ వాళ్ళకీ ఉన్న తేడాని వివరిస్తోంది. నయనతార, తమన్నా కేవలం లోకల్ పార్టీలు..నేను అటు బాలీవుడ్ కి వెళ్తా..గట్టిగా మాట్లాడితే హాలీవుడ్ లో అదరకొడతా అంటోంది. తన హాలీవుడ్ సినిమాను గుర్తు చేస్తూ..ఆ సినిమా ఫ్లాఫ్ కదా అంటే..ఆ లెక్కకొస్తే నయనతారకి వరస ఫ్లాప్ లు లేవా..తమన్నా కు డిజాస్టర్స్ లేవా అని వాదిస్తోంది. ప్రస్తుతం జగ్గుభాయ్,కుట్టి,చికుబుకు చిత్రాలు చేస్తున్న శ్రియ త్వరలో విడుదల కాబోయే మల్లన్న చిత్రంపై ఆశలు గట్టిగా పెట్టుకుంది. ఆ సినిమా తన కెరీర్ ని ఎక్కడికో తీసుకుపోతుందని చెప్తోంది. ఇక ఎందరో హీరోయిన్స్ వస్తూంటారు..వాళ్ళతో పోటి పెట్టుకుంటే ఎలా..మనం సరిగ్గా చేస్తున్నామా లేదా..మన పొజీషన్ ఎలా ఉందన్న దానిపైనే దృష్టి పెట్టాలని వేదాంతం చెప్తోంది. పిస్తా పరాజయంతో కాస్త కుంగినా మళ్ళీ సర్ధుకుని తనదైన శైలిలో తమిళ, తెలుగు చిత్రాల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య కొందరు తెలుగు నిర్మాతలు ఆమెను సంప్రదించారు కానీ..ఆమె రెమ్యునేషన్ విని వెనక్కి పారిపోయి వచ్చారని టాక్.


Click it and Unblock the Notifications