రజనీకాంత్ ఒప్పుకుంటేనే... డైరక్ట్ చేస్తా

By Srikanya

If Rajanikanth accepts...Says P.Vasu
చెన్నై : సినిమాల్లో ఇప్పుడు సీక్వెల్స్ యుగం నడుస్తోంది. ప్రతీ హిట్ సినిమాకు సీక్వెల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. కోలీవుడ్ లో 'చంద్రముఖి' సృష్టించిన హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయాన్నే నమోదు చేసింది. ఈ చిత్రం సీక్వెల్ కావాలని ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో 'నాగవల్లి'గా సీక్వెల్‌ తెరకెక్కించారు..అది విజయం సాధించలేదు.

తమిళంలో మాత్రం వచ్చే సంవత్సరం చంద్రముఖి సీక్వెల్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రజనీసైడ్ నుంచి ఏ విధమైన కన్ఫర్మేషన్ రాలేదు. దాంతో ఈ సినిమాపై అభిమానులలో సస్పెన్స్‌ నెలకొంది. మధ్యలో అజిత్‌ 'చంద్రముఖి-2'లో నటిస్తారనే వార్తలొచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. రజనీ నటిస్తానంటే రెండో భాగం తెరకెక్కించేందుకు తాను సిద్ధమే అంటున్నారు 'చంద్రముఖి' దర్శకుడు పి.వాసు.

పి.వాసు మాట్లాడుతూ ''ఓ సూపర్‌స్టార్‌ అయినా.. సాదాసీదాగా ఉండటాన్ని రజనీ నుంచే నేర్చుకోవాలి. ఎవరైనా ఆయనతో ఒక్కసారి మాట్లాడితే చాలు.. అభిమానించటం ప్రారంభిస్తారు. ఆయన నటించాలేగానీ సీక్వెల్‌ తెరకెక్కించేందుకు నేను సదా సిద్ధం. రజనీ ఒప్పుకోకుంటే కనీసం సెట్స్‌పైకి కూడా ఎక్కదు''అని పి.వాసు పేర్కొన్నారు.

ఇక రజనీకాంత్ హీరోగా నటించిన 'కోచ్చడయాన్' (తెలుగులో 'విక్రమసింహా') సినిమా విడుదల మరింత ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో వేడుక నిజానికి రజనీకాంత్ జన్మదినం సందర్భంగా గురువారం (డిసెంబర్ 12) జరగాల్సి ఉంది. కానీ ఆ వేడుకను కూడా జనవరి మొదటి వారానికి వాయిదా వేశారు.

ఈ సంగతిని తమిళ ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు శ్రీధర్ పిళ్లై ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. శ్రీధర్ పిళ్లై ట్వీట్ లో ... "ఈ సినిమా విడుదల 2014 ఏప్రిల్‌కు మారింది'' అని చెప్పారు. దీపికా పడుకోనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్, జాకీ ష్రాఫ్, ఆది పినిశెట్టి, శోభన, నాజర్ వంటి పేరుపొందిన తారలు నటిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్' తరహాలో మోషన్ కాప్చర్ 3డి టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించారు. కె.ఎస్. రవికుమార్ రచన చేయగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో లక్ష్మీగణపతి ఫిలిమ్స్ విడుదల చేస్తున్న ఈ సినిమాని హిందీ, మలయాళం, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లోనూ అనువదిస్తున్నారు.

'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X