భారతీరాజా మరణం: మీడియాపై ఇళయరాజా ఆగ్రహం
దక్షిణ సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకులు భారతీరాజా మృతివార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన ఇకలేరనే వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారు జామున మరణించారు.
ఆయనను చివరిసారి దర్శించుకొనేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చారు.
తన ఆప్తుడు, సహచర కళాకారుడైన భారతీరాజా భౌతికకాయాన్ని చూసేందుకు చెన్నై నీలాంకరైలోని ఆయన నివాసానికి చేరుకున్న ఇసైజ్ఞాని ఇళయరాజా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన మిత్రుని మరణాన్ని జీర్ణించుకోలేక, అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

భారతీరాజా పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తీవ్ర దుఃఖంలో ఉన్న ఇళయరాజా, ఆగ్రహం చెందారు. ఆయన మౌనంగా శాశ్వత నిద్రలో ఉన్నారు. ఇది ఇంటర్వ్యూలు తీసుకునే సమయమా? ఇంటర్వ్యూలు ఇచ్చే సమయమా? మీరు ప్రశ్నలతో విసిగించకండి. ఇక్కడ మాట్లాడటానికి ఇప్పుడు ఏముంది?" అని ప్రశ్నించారు. శోకసంద్రంలో ఉన్న సమయంలో మీడియా ప్రశ్నలు ఎదురవ్వడంపై ఆయన తన తీవ్ర వేదనను, అసహనాన్ని బహిరంగంగానే ప్రదర్శించారు.
పరిస్థితిని అర్ధం చేసుకొని కొద్దిసేపటికి ఇళయరాజా శాంతించారు. భారతీయ రాజా నాకు అత్యంత ఆప్తుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమాత్మను ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. "నేను నిరంతరం ప్రార్థించే వ్యక్తిని అన్న విషయం అందరికీ తెలిసిందే. నాతో మీకు ఎంతటి ఆత్మీయత ఉందో, భారతీరాజాతో కూడా నాకు అంతే గాఢమైన అనుబంధం ఉంది. మేమిద్దరం వేరు కాదు, ఒకటే. ఈ దేశాన్ని, ప్రజలను, సహచర కళాకారులను ప్రేమించడమే నా జీవిత లక్ష్యం" అని పేర్కొంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
తేని జిల్లాలో వీరు నాటకాలు వేసే రోజుల్లోనే ఇరువురి మధ్య విడదీయలేని స్నేహం చిగురించింది. 'పావలర్ బ్రదర్స్' బృందంలో ఇళయరాజా సంగీత ప్రయాణం మొదలైనప్పటి నుంచే భారతీరాజా ఆయనకు తోడుగా నిలిచారు. '16 వయదినిలే', 'కొత్త వారపుగల్', 'మొదల్ మరియాదై' వంటి క్లాసిక్ చిత్రాలకు ఇళయరాజా సంగీతం ప్రాణం పోసింది. భారతీరాజా కెమెరా, ఇళయరాజా సంగీతం కలిస్తే అదో అద్భుత సృష్టిగా నిలుస్తూ తమిళ సినిమా గమనాన్నే మార్చేశాయి.


Click it and Unblock the Notifications