ఇళయరాజాను బెదిరిస్తున్న ఎల్వీ ప్రసాద్ మనవడు.. కానుకగా ఇచ్చిన స్థలం కోసం దాడి, కేసు నమోదు!

మాస్ట్రో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరోసారి ఒక కొత్త వివాదం కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. గత కొంత కాలంగా ఆయన ఎల్వీ ప్రసాద్ కి సంబంధించిన ఒక చిన్న స్థలంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బెదిరింపులతో పాటు స్టూడియోపై దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని ఇళయరాజా పోలీసులను ఆశ్రయించారు.

Recommended Video

Ilaiyaraaja Files Complaint Against LV Prasad Studio Owner || Oneindia Telugu
బెదిరింపులు.. దాడి..

బెదిరింపులు.. దాడి..

సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా అంటే ప్రతి ఒక్కరికి గౌరవమే. అయితే ఈ వయసులో తనను ఎల్వీ ప్రసాద్ మనవడు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం అందరిని షాక్ కి గురి చేసింది. పెద్దవారిని అని చూడకుండా బెదిరించడమే కాకుండా స్టూడియోపై దాడి చేసి తన సంగీతానికి సంబంధించిన పరికరాలను కూడా ధ్వంసం చేయించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

కానుకగా ఇచ్చిన స్థలం

కానుకగా ఇచ్చిన స్థలం

వివరాల్లోకి వెళితే.. సీనియర్ నిర్మాత దర్శకులు ఎల్వీ ప్రసాద్ అప్పట్లో ఇళయరాజాపై గౌరవంతో మ్యూజిక్ పనులు చేసుకోవడానికి తన స్టూడియోలోనే కొంత స్థలాన్ని ఒక గదిని కానుకగా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా ఇళయరాజా అందులోనే రికార్డింగ్ పనులను చేసుకుంటున్నారు. అయితే గత ఏడాది నుంచి స్థలం విషయంలో అభ్యంతరాలు మొదలయ్యాయి.

ఇళయరాజా అడ్డుగా ఉన్నారని

ఇళయరాజా అడ్డుగా ఉన్నారని

ఎల్వీ.ప్రసాద్ కుమారుడు రమేష్ స్టూడియో బాధ్యతలు తీసుకున్న తరువాత తండ్రి మాటను గౌరవించి ఇళయరాజాను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. అయితే ఆయన కుమారుడు సాయి ప్రసాద్ ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకోవడంతో స్టూడియోలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అడ్డుగా ఇళయరాజా ఉన్నారని ఖాళీ చేయవల్సిసిందిగా డిమాండ్ చేసినట్లు ఇళయరాజా ఆరోపించారు.

పోలీసులను ఆశ్రయించిన ఇళయరాజా

పోలీసులను ఆశ్రయించిన ఇళయరాజా

ఎల్వీ.ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ పై చెన్నైలో కేసు నమోదు చేసిన ఇళయరాజా తన మ్యూజిక్ థియేటర్ విషయంలో బెదిరింపులకు పాల్పడుతున్నారను అలాగే సంగీతానికి సంబంధించిన అతి విలువైన పరికరాలను కూడా ధ్వంసం చేశారని పోలీస్ కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X