నాకు ఇలాంటివి నచ్చవు.. నటిని వేదికపైనే తిట్టేసిన ఇళయరాజా!
భారత దేశం గర్వించదగ్గ సంగీత దర్శకులలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఒకరు. కొన్ని దశాబ్దాలుగా ఇళయరాజా సంగీత ప్రియులని ఉర్రూతలూగిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు క్లాసిక్ అనదగ్గ సంగీతాన్ని ఇళయరాజా అందించారు. ఇటీవల చెన్నైలో ఇళయరాజాకు ఓ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు దర్శకుడు శంకర్, హీరో విక్రమ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

యాంకర్‌గా నటి రోహిణి
ఇళయరాజా సన్మాన కార్యక్రమానికి సీనియర్ నటి రోహిణి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. శంకర్, విక్రమ్ లాంటి ప్రముఖులంతా ఇళయరాజా సంగీత శైలి, ఆయన గొప్పతనం గురించి ప్రసంగించారు. నటి రోహిణి శంకర్ ని అడిగిన ఓ ప్రశ్నకు ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో రోహిణి కంగారు పడిపోయింది.
నాకే ఛాన్స్ ఇప్పిస్తున్నావా
మీరు ఇళయ రాజా గారితో కలసి ఎప్పుడు పనిచేస్తారు.. మీ కాంబినేషన్ కోసం అంతా ఎదురుచూస్తున్నాం అని రోహిణి శంకర్ ని ప్రశ్నించింది. దీనితో ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకే ఛాన్స్ ఇప్పిస్తున్నావా.. నాకు ఇలాంటివి నచ్చవు. ఇక్కడ సినిమల ప్రస్తావన వద్దు. ఆయనకు ఎవరితో పనిచేయాలనిపిస్తే వారిని ఎంచుకుంటారు. ఇలాంటి ప్రశ్నలు అడిగి ఎందుకు ఇబ్బందిపెడతావు అని ఇళయరాజా రోహిణిని వేదికపైనే అడిగేశారు.

కంగారు పడుతూ
ఇళయరాజాకు కోపం రావడంతో రోహిణి కంగారు పడింది. నా ఉద్దేశం అది కాదు సర్ అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన అనంతరం తాను ఇళయరాజా గారితో ఎందుకు పనిచేయలేదో శంకర్ వివరించారు. తన తొలి చిత్రం జెంటిల్ మ్యాన్ కోసం ముందుగా ఇళయరాజా గారినే సంగీత దర్శకుడిగా అనుకున్నానని, కానీ ఆయనతో కలసి పనిచేయలేకపోయానని శంకర్ తెలిపాడు.

భయం వేసింది
ఇళయరాజా సర్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. దర్శకుడు, సంగీత దర్శకుడు చాలా విషయాలు చర్చించుకుంటేనే ఆ చిత్రం బాగా వస్తుంది. కానీ నాకు ఆ సమయంలో ఇళయరాజా గారితో మాట్లాడే ధైర్యం లేదు. ఏదైనా విషయంలో ఆయన్ని ఒప్పించగలనా అనే సందేహం వేసింది. అందుకే ఆయనతో సినిమా చేయలేకపోయా అని శంకర్ బదులిచ్చారు.


Click it and Unblock the Notifications











