కమల్, ఇళయరాజా ప్రాక్టికల్ జోక్

By Srikanya

చెన్నై: కమల్ హాసన్, తనూ కలిసి ఓ ప్రాక్టికల్ జోక్ వేసామని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా అంటున్నారు. కమల్‌హాసన్‌తో తనకు చక్కటి అనుబంధం ఉన్నదని ఇళయరాజా చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. నేటికీ మా మధ్య స్నేహం కొనసాగుతోంది. తమాషా సంఘటనలు కూడా మా మధ్య చాలానే ఉన్నాయి. అలాంటి తమాషా సంఘటన ఒకటి వినిపించారు.

ఇళయరాజా మాటల్లోనే... 'ఎన్నడి మీనాక్షి' అనే పాటను ఏవీఎం స్టూడియోలో రికార్డింగ్‌ చేస్తున్న రోజులవి. ఆ రికార్డింగ్‌ చూసేందుకు కొందరు కళాశాల విద్యార్థినులు వచ్చారు. వారిని అట పట్టించాలని నేను కాగితాన్ని తీసుకెళ్ళి కమలహాసన్‌కి ఇచ్చాను. ఆయన దాన్ని తదేకంగా చూస్తూ... ఈ మెట్టు పైనపెట్టండి, దీనిని కిందకి జరపండని నాకు చెప్పారు. సరేనంటు వినయంగా తల ఉపాను. అది చూసి విద్యార్థినులందరూ ఒకటే గుసగుసలు. కమల్‌కు సంగీతంపై ఇంత పట్టు ఉందా? ఇళయరాజా ఆయన్ను అడిగి స్వరాలు సమకురుస్తారా అని చెప్పుకోవడం వినిపించింది. పక్కగదిలోకి వెళ్లి మేమిద్దరం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నామని తెలిపారు.

ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా కమల్...విశ్వరూపం విడుదల గురించే చర్చ. వెండి తెర కన్నా ముందుగా బుల్లితెరపై డీటీహెచ్‌ ద్వారా విడుదల చేయాలనుకునే చిత్రాలకు, సంబంధిత హీరోలకు, నిర్మాతలకు తాము సహకరించమని తమిళనాడు థియేటర్‌ యజమానుల సంఘం పేర్కొంది. ఈ మేరకు చెన్నైలోని సంఘం కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కమల్‌ తన 'విశ్వరూపం' చిత్రాన్ని డీటీహెచ్‌ ద్వారా బుల్లి తెరపై విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై థియేటర్‌ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ''ఇలా విడుదల చేయడం వల్ల థియేటర్‌ యజమానులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి జయలలిత జోక్యం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి'' అని సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X