ఇళయరాజాకు అంతర్జాతీయ పురస్కారం

By Srikanya

చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చిన తొలి ఆంగ్ల చిత్రం 'లవ్‌ అండ్‌ లవ్‌ ఓన్లీ'. ఈ ఆస్ట్రేలియా సినిమాకు సంబంధించి ఇళయరాజాకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం దక్కింది. జూలియన్‌ కరిగాలన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. ఆస్ట్రేలియన్‌ చిత్రం. ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్‌ పూర్వీకులు మదురైకి చెందినవారు. దాంతో వారు సంగీత దర్శకుడుగా ఇళయరాజాని తీసుకున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇళయరాజాకు పురస్కారం దక్కింది. ఈ సినిమాలోని మూడు పాటలకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఫ్రెంట్‌ హిపోర్‌ నేపథ్యసంగీతం అందించారు.

Ilayaraja bags international award

ఓ పంజాబీ యువకుడు ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లి.. అక్కడున్న ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో ఉద్యోగం చేస్తూ.. ఆ దేశానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడన్నదే కథ. వీరిద్దరి సంస్కృతి ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు అవార్డును ప్రకటించారు. ఉత్తమ యువదర్శకుడిగా కూడా జూలియన్‌ పురస్కారాన్ని అందుకోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X