హాట్ టాపిక్ : స్టార్ డైరక్టర్ పై ఇళయరాజా సీరియస్ ..మాటల యుద్దం
గతంలో భారతీరాజా, ఇళయరాజా కలిసి పనిచేసిన చిత్రాలు చిత్రరంగాన్ని మలుపుతిప్పాయి. అనేక ఏళ్లుగా కలిసి ఉన్న వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి సంఘర్షణకు దారితీసింది. ఇటీవల మదురైలో జరిగిన అన్నకొడియుం కొడి వీరనుం చిత్రం పాటల సీడీ ఆవిష్కరణకు ఇళయరాజాను తీసుకెళ్లారు. వేదికపై భారతీరాజా తనను కించపరుస్తూ మాట్లాడినట్లు భావించిన ఇళయరాజా ఆగ్రహించారు.
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇళయరాజా మాట్లాడుతూ భారతీరాజా తన గురించి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. అతను తన వద్ద వ్యక్తిగతంగా చేయాల్సిన వ్యాఖ్యలు బహిరంగంగా తెలపడం సముచితం కాదన్నారు. అతనిలా తాను మద్యం సేవించి రభస సృష్టించాలనుకుంటున్నారేమోనని అన్నారు. ఈ వాఖ్యపై భారతీరాజా మండిపడ్డారు.
భారతీ రాజా దానికి కౌంటర్ ఇస్తూ...ఇళయరాజా మహా వ్యక్తినన్న అహంతో ప్రవర్తించరాదని అన్నానని అందుకాయనకు కోపం వచ్చినట్లుందని తెలిపారు. తాను ఉత్తముడినని పేర్కొనలేదని, పనిచేయగల వ్యక్తి పని చేస్తుంటాడని, పని చేయలేని వ్యక్తి తత్వం మాట్లాడుతాడని వ్యాఖ్యానించారు. వీరి మాటల యుద్ధం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరిరువురికీ సన్నిహితులైన దర్శకుడు కే.బాలచందర్, బాలు మహేంద్ర, పంజు అరుణాలచలం వీరి మధ్య సయోధ్య కుదిర్చే యత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












