Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇళయరాజా రివిల్ చేసిన తన సంగీత రహస్యం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన జీవితకాలంలో ఎన్నో నిలిచిపోయే పాటల్ని అందించారు..అందిస్తున్నారు. అయితే ఆ పాటలకు ప్రేరణ ఎక్కడిది..ఆ మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం గురించి ఇళయరాజా చెబుతూ "నేను సాధారణమైన మనిషిని. ఎప్పుడూ నా బాణీలకు ప్రేరణనిస్తున్న విషయం గురించి ఆలోచించలేదు. అది అలా వచ్చేస్తోందంతే! ప్రశాంతంగా కూర్చొని ఆత్మ మాట వింటుంటే సంగీతం దానంతట అది రావాల్సిందే! ఇన్నాళ్లూ ఆత్మతోనే సంగీతం అందించాను. సన్నివేశం, సందర్భం...వీలునిబట్టి సాహిత్యం తెలుసుకొని అందులో ఉన్న అర్థం గ్రహించి స్వరాలు సమకూరుస్తాను. దాన్ని మెచ్చుకుంటున్న శ్రోతలకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి" అన్నారు. అలాగే...సంగీత దర్శకుడు ఎవరైనా..కథను లోతుగా అర్థం చేసుకొని పరిస్థితికి తగ్గట్లుగా సరళమైన సంగీతాన్ని అందిస్తే..తప్పకుండా ప్రేక్షకుల్లోకి అది చేరుతుందని అన్నారు. అంతటి మహానుభావుడు కాబట్టే ఇప్పటికీ ఆయన సంగీతం మనల్ని మైమరిపిస్తుంది.