twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పుణ్యకోటి' : ఇళయరాజా తొలిసారిగా...

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇన్నాళ్లుగా సాధారణ చిత్రాలకు సంగీతమందించిన ఇళయరాజా ఇప్పుడు తొలిసారిగా యానిమేషన్‌ సినిమాకు స్వరాలందించబోతున్నారు. 'పుణ్యకోటి' పేరుతో రూపొందుతున్న ఓ యానిమేషన్‌ సినిమాకు ఆయన సంగీత దర్శకుడుగా పని చేస్తున్నారు. వచ్చే ఆగస్టులో ప్రారంభంకానున్న ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సంస్కృతంలో రూపొందబోతున్న తొలి యానిమేషన్‌ చిత్రమిది. చిన్నప్పటి నుంచి మనం వింటున్న ఆవు-పులి కథ అని తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ''ఈ కథ గురించి చెప్పిన వెంటనే ఇళయరాజా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. మీ వెనుక నేనున్నా అంటూ ధైర్యమిచ్చారు. 'క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా రూపొందబోతున్న ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలి' అని అభిమానులకు పిలుపునిచ్చారు కూడా'' అంటున్నారు చిత్ర దర్శకుడు వి. రవిశంకర్‌.

     Ilayaraja to score the music of first-ever Sanskrit animation film

    ఈ సినిమా విషయానికొస్తే 'పుణ్యకోటి' అనే కన్నడ ఫోక్‌ సాంగ్‌ ఆధారంగా యానిమేషన్‌లో సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    అభిమానులు ఇసైజ్ఞాని అని పిలుచుకునే ఈ అలుపెరగని సంగీత యోధుడు నేడు 72వ ఏట అడుగుపెడుతున్నారు. నాలుగు జాతీయ పురస్కారాలు, పద్మభూషణ్‌ (2010) పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది.

     Ilayaraja to score the music of first-ever Sanskrit animation film

    ఇక...

    డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ఉన్న ఎస్‌ఐలకు సంగీత జ్ఞాని ఇళయరాజా లేఖ రాశారు. ''నా పాటలను తస్కరిస్తున్నారు. నా అనుమతి లేకుండా సొమ్ము చేసుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి'' అని ఇళయరాజా ఆ లేఖలో కోరారు. గతంలోనూ ఆయన ఇలా సీరియస్ అయ్యి...కోర్టుకు వెళ్లారు..కానీ పెద్ద ఫలితం కనపడలేదు.

     Ilayaraja to score the music of first-ever Sanskrit animation film

    తన పాటలు తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు టీవీ, రేడియో ఛానల్స్ ప్రసారం చేయడంపై, ఆడియో కంపెనీలు సీడీలు చేసి అమ్మడంపై ఇళయరాజా ఆగ్రహంగా ఉన్నారు. తన పాటలను సీడీల రూపంలో, ఇంటర్నెట్ డౌన్ లోడ్స్ రూపంలో అమ్ముతున్న ఐదు ఆడియో కంపెనీలపై కేసు వేసారు కూడా.

    మద్రాసు హై కోర్టు కూడా ఆయనకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇకపై తన పాటలు ఎవరు ఎక్కడ వాడాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందే, తన వద్ద రైట్స్ కొనుక్కోవాల్సిందే అని ఇళయరాజా స్పష్టం చేసారు.

    English summary
    In yet another feather to his cap, composer Ilaiyaraaja is to score the music of the first-ever animation film in Sanskrit titled as Punyakoti. The novel venture is directed by Ravishankar. The script is about a cow, which speaks only the truth, living in the poverty-stricken Karunadu village. Maestro not only agreed to compose music for the film but also has lauded the efforts of the film-maker.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X