ఒలింపిక్స్ ఓపినింగ్ లో ఇళయరాజా పాట

By Srikanya

త్వరలో లండన్ లో జరగనున్న ఒలింపిక్ గేమ్స్ ప్రారంభ రోజు ఉత్సవంలో ఇళయరాజా సంగీతం ప్రపచం విననుంది. అన్ని దేశాల సంస్కృతులు ప్రతిబింబించే విధంగా ప్రతీ దేశం నుంచి పాటలను తీసుకుని ప్రెసెంట్ చేస్తూంటారు. ఆ క్రమంలో ఇళయరాజా సంగీతం మన దేశం ను రిప్రెజెంట్ చేయటానికి ఎంపికైంది. రామ్ లక్ష్మణ్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన నాన్ దాన్ ఉంగప్పాడ పాటను ఎంపిక చేసారు.

ఈ విషయమై ఇళయరాజా సన్నిహితుడు ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..ఈ పాటను ఎంపిక చేసుకోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ డానీ బోయల్ ఈ పంక్షన్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఓపినింగ్ సెర్మనీ జరగనుంది. ఆయనే ఈ పాటలను డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఈ పాటను తీసుకున్నారని సమాచారం.

ప్రస్తుతం ఇళయరాజా నాని, సమంత జంటగా గౌతమ్‌వాసుదేవమీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎటో వెళ్లిపోయింది మనసు'చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు బిట్ సాంగ్స్ తో కలిపి తొమ్మిది పాటలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంత శ్రీరాం ఈ పాటలనన్నిటినీ సింగిల్ కార్డుతో రాసారు. ఈ చిత్రం ప్రోమో ఇప్పటికే రిలీజయ్య ఇళయారాజా అభిమానుల్లో ఆసక్తిని రేపింది. గ్యారెంటీగా మ్యూజికల్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

నాని మాట్లాడుతూ ''చిన్నప్పటి నుంచీ ఇళయరాజా సంగీతం అంటే పిచ్చి. నా ఫోన్‌లో కూడా ఆయన పాటలే ఉంటాయి. నేను సహాయ దర్శకుణ్ని కావడానికి స్ఫూర్తినిచ్చిన దర్శకుల్లో గౌతమ్‌మీనన్‌ ఒకరు. వీరిద్దరితో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ కథ విన్నప్పుడు నా ప్రేమ కథే అనిపించింది. మనసు ఎటో వెళ్లిపోయింది. ప్రేక్షకులకీ అలాంటి భావనే కలుగుతుంది''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X