Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘‘అతడు సూపర్ స్టార్ కావొచ్చేమో కానీ సూపర్ యాక్టర్ కాదు’’
ఇళయ దళపతి విజయ్ పేరు ఎత్తితే చాలు తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరో అతడు. అలాంటి హీరోపై ఓ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.
విజయ్ సూపర్‌స్టార్ కావచ్చేమో కానీ సూపర్ నటుడు మాత్రం కాదంటూ మలయాళ నటుడు సిద్ధికీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేవలం ఆయనకు ఉన్నస్టార్ డమ్ వల్ల అతడి సినిమాలు ఆడుతున్నాయి. నేనైతే అతడిని గొప్ప నటుడు అనను, తమిళంలో ఇప్పుడున్న వారిలో గొప్ప నటుడు అంటే నా దృష్టిలో కమల్ హాసన్ అని సిద్ధిఖీ చెప్పుకొచ్చారు.
మలయాళం చిత్రసీమలో 'మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి గొప్ప నటులు ఉన్నందుకు తమ సినీ పరిశ్రమ ఎంతో అదృష్టం చేసుకుందని సిద్దిఖీ చెప్పుకొచ్చారు. వారి వల్ల మధుర రాజా, లూసీఫర్ వంటి మంచి చిత్రాలు వచ్చాయి. వారి సినిమాల వల్ల మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి, కానీ తమిళ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదన్నారు.
అయితే సిద్ధికీ కామెంట్లను మరో మలయాళం నటుడు హరీష్ పేరడి ఖండించారు. తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ఆయన స్పందిస్తూ... విజయ్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, సూపర్ యాక్టర్ అయి తెలిపారు. అంతే కాదు విజయ్ చాలా నిజాయితీగల వ్యక్తి, మంచి మనసున్న మనిషి అంటూ పొగడ్తలు గుప్పించారు.