»   » రూ. 30 కోట్లు: రెమ్యూనరేషన్లో నెం. 2 ఆయనే!

రూ. 30 కోట్లు: రెమ్యూనరేషన్లో నెం. 2 ఆయనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ స్టార్స్ రెమ్యూనరేషన్స్ ఎప్పుడూ ఆసక్తికరమే. స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు కోట్లలో ఉంటాయి. హీరోల రెమ్యూనరేషన్లు వారి సినిమాల ఫలితలు, వసూళ్లపై ఆధారపడి ఉంటాయి. తాజాగా రెమ్యూనరేషన్ విషయంలో తమిళ హీరో విజయ్ వార్తల్లోకి ఎక్కాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇళయతలపతి విజయ్ తను నటిస్తున్న 59వ సినిమా(ఇంకా టైటిల్ ఖారు కాలేదు) కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా కళైపులి థాను నిర్మిస్తున్నారు.

Ilayathalapathy Vijay remuneration 30 crore

ఈ సినిమాకు గాను విజయ్ అన్ని టాక్స్ మినహాయింపులు పోను రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియాలో ఇదే సెకండ్ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్. తొలి స్థానంలో రజనీకాంత్ ఉన్నారు. ఆయన సినిమాకు రూ. 35 నుండి 40 కోట్లు తీసుకుంటారు.

ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతున్నాయి. వంద కోట్ల వసూళ్లను బీట్ చేస్తున్నారు. ఆయన సినిమాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం సబబే అని ఆయన అభిమానులు అంటున్నారు.

English summary
According to a report, Ilayathalapathy Vijay has received his highest pay cheque for Vijay 59 which is being directed by Atlee and produced by Kalaipuli S Thanu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu