నాగార్జున అజాద్ చిత్రం రీమేక్ చేస్తున్న హీరో
నాగార్జున, సౌందర్య కాంబినేషన్ లో తిరుపతిస్వామి డైరక్ట్ చేసిన అజాద్ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. ఇళయపతిగా పేరు తెచ్చుకున్న విజయ్ తన యాభై వ చిత్రంగా దీనిని చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని జయం రాజా డైరక్ట్ చేయనున్నారు. ఇక దీనిని విజయ్ సూచించి మార్పులతో స్క్రిప్టు చేయమని చెప్పాడట. దాన్ని ఫాలో అవుతూ రాజా మాస్ మసాళాలు అద్దటంతో వర్కవుట్ అయింది. ఇక రాజా ఇంతకు ముందు విజయ్ తో ఏ చిత్రాన్నీ చేయలేదు. ఇదిలా ఉంటే విజయ్ 50 చిత్రం డైరక్ట్ చేయటానికి బాగా పోటీ వచ్చింది. ఈ వరసలో దర్శకుడు కె.యస్.రవికుమార్ ముందున్నారు. అయితే రాజాకి రీమేక్ ల కింగ్ గా పేరుండటం కలసివచ్చింది.
నాగార్జున అజాద్ తిరుపతి స్వామి సౌందర్య విజయ్ కె.యస్.రవికుమార్ 50వ సినిమా జయం రాజా vijay azad soundarya nagarjuna raja jayam ilaythalapathy


Click it and Unblock the Notifications