ఇలియానా మళ్ళీ మొదలెట్టింది
వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న ఇలియానాకు చేతిలో హిందీ త్రీ ఇడియట్స్ రీమేక్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు.అయినా ఆమె రెమ్యునేషన్ గురించే రోజు కో వార్త వస్తూనే ఉంది. కోటి రూపాయలు తీసుకుంటారని, ఒక్కోసారి ఆ పైనే డిమాండ్ చేస్తారనే టాక్ కూడా ఉంది.ఆమె దాన్ని ఖండిస్తూనే ఉంది.మరోసారి రెమ్యునేషన్ విషయమై ఆమె మాట్లాడుతూ.. మార్కెట్లో నా రేంజ్ ఏంటో తెలుసుకునే నిర్మాతలు పారితోషికం ఇస్తారు. అంతేగానీ నేనెంత డిమాండ్ చేస్తే అంత కళ్లు మూసుకుని ఇచ్చేయరు అంటూ పాత పాటే మొదలెట్టింది ఇలియానా. దీని గురించే ఆమె పై విధంగా స్పందించారు. ఒకవేళ నేను అంత డిమాండ్ చేయడంలేదని చెప్పినా ఎవరూ వినరు. అందుకని పారితోషికం విషయంలో నేను వివరణ ఇచ్చుకోవడం అనవసరం అని కూడా అన్నారామె.
ప్రస్తుతం ఇలియానా నటిస్తున్న చిత్రాల్లో హిందీ 3 ఇడియట్స్ తమిళ రీమేక్ నన్బన్ ఒకటి. విజయ్, జీవా, శ్రీకాంత్ కాంబినేషన్‌లో శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. అలాగే ముగ్గురు హీరోలూ చాలా ఫ్రెండ్లీగా మెలిగారు. హిందీ 3 ఇడియట్స్ చూశాను. నా నటనలో కరీనా ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడ్డాను. కరీనా చేసినట్లుగానే నేను కూడా యాక్ట్ చేస్తే ఇక సినిమా చేయడమెందుకు, 3 ఇడియట్స్ చూస్తే కరీనా శైలి కనిపిస్తుంది.నన్బన్ నా టైప్‌లో ఉంటుంది అని చెప్పారు.


Click it and Unblock the Notifications











