ఇది లైఫ్‌లోనే ప్రత్యేకం..ఇలియానా
ఇది లైఫ్‌లోనే ప్రత్యేకం.త్వరలో ఓ ఫొటోషూట్‌లో పాల్గొనబోతున్నాను అంటోంది ఇలియానా. ఆమె కెరీర్ ప్రారంబించిన ఇన్నేళ్ళ తర్వాత ఫోటో సెషన్ లో పాల్గోబోతోంది. ఆ విషయం గురించి చెప్తూ..ఇంప్రెషన్ అనేది ఫస్ట్ లుక్‌తోనే క్రియేట్ అవుతుంది. అందుకే నా లాంటి హీరోయిన్స్ కు ఫొటో సెషన్ అవసరం ఎంతైనా ఉంది. నటిగా ఎదగాలంటే... ముందు మన గ్లామర్ సత్తా ఏంటో తెలియజేయాలి. దానికి ఫొటోసెషనే సరైన మార్గం. ఫొటోషూట్స్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. రేపు ఈ స్టిల్స్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి అంటోందామె. ప్రస్తుతం ఆమె శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'త్రీ ఇడియట్స్" రీమేక్ 'నన్బన్"లో చేస్తోంది.


Click it and Unblock the Notifications











