ఆ ప్లాఫ్ రీమేక్‌లో ఇలియానా?
ఇలియానా తాజాగా ఓ కొత్త తమిళ చిత్రంలో కమిటయ్యింది. ఆ చిత్రం హిందీలో మాదుర్ బంగార్కర్ దర్శకత్వం వహించిన ఫ్యాషన్. ఇందులో ప్రియాంక చోప్రా పాత్రకు ఇలియానా చేయనున్నదని తెలుస్తోంది. హిందీలో ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ హీరోయిన్లుగా నటించారు. మోడలింగ్ రంగం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు. కమర్షియల్ గా ఫ్లాఫ్ అయింది. అయితే ఇందులోని పాత్రలకు ప్రియాంక చోప్రాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు, కంగనారనౌత్‌కు ఉత్తమ సహాయనటి అవార్డు వచ్చాయి. దాంతో నిర్మాత కె.మంజు ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ భాషలలో పునర్ నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఫ్యాషన్ హిందీ చిత్రాన్ని ఏ భాషలోనైనా రూపొందించవచ్చన్నారు. ఈ చిత్రం కథ అలాంటిదని తెలిపారు. అందుకే దీన్ని దక్షిణాది భాషలన్నింటిలోనూ పునర్ నిర్మించాలని భావించానన్నారు. దీనికి ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వం వహించనున్నారని వివరించారు. ప్రియాంక చోప్రా పాత్రకు ఇలియానాతో చర్చిస్తున్నామని తెలిపారు. మొత్తానికి తమిళంలో చాలా కాలం తర్వాత ఇలియానా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం కావటంతో ఆమెపై మంచి అంచనాలే ఉంటాయి.ఇక ఇంద్రజిత్ లోకేష్ డైరక్ట్ చేసిన కంత్రి మొగుడు చిత్రం రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయింది.


Click it and Unblock the Notifications











