ఇలియానా కోసం సూర్య పట్టు
తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఇలియానా స్ధానమేమిటో అందరికీ తెలుసు. రెండు తెలుగు సినిమాలతో అగ్రస్ధానానికి చేరిన ఇలియానా కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఒక ఏడాది వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవు. ఇలా ఉండగా తమిళంలో కూడా ఇలియానాకు డిమాండ్ ఏర్పడింది. హీరోయిన్ల పారితోషికం విషయంలో తెలుగుతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. తమిళంతో పాటు తెలుగు సినిమాల మీద దృష్టి సారించిన సూర్య తన తాజా చిత్రంలో ఇలియానా హీరోయినా ఉండాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. తెలుగులో తనలాగే పాపులర్ అయిన ఇలియానా హీరోయిన్‌గా ఉంటే తెలుగు వెర్షన్ నుంచి మంచి కలెక్షన్లు రాబట్టవచ్చని సూర్య నిర్మాత, దర్శకులకు నచ్చజెప్పడంతో ఇలియానా డేట్స్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఇలియానా అందుకు ఒప్పుకుంటుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.


Click it and Unblock the Notifications