ఇలియానా వెంటపడుతున్న విజయ్
బంగారం సినిమాను తనివితీరా చూసి దాని తమిళ రీమేక్ హక్కులను ఎంత మొత్తానికైనా కొనుగోలు చేయడానికి హైదరాబాద్ వచ్చిన తమిళ హీరో విజయ్ బంగారం చూసిన తర్వాత మనసు మార్చుకుని పోకిరి హక్కుల కోసం ఎగబడ్డాడు. ఈ సినిమా హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన తర్వాత ఆయన హైదరబాదీ బిర్యానీ తినకుండానే చెన్నై వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు అసలు విషయం తెలిసివచ్చింది. పోకిరి విజయానికి ఇలియానా కూడా ఒక కారణమన్నది ఆ విషయం. విజయ్ ఇలియానాను సంప్రదించగా ఆమె తాను బిజీగా ఉన్నట్టు చెప్పినట్టు తెలుస్తోంది. పోకిరి తర్వాత ఇలియానా కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అనేక మంది పెద్ద హీరోలు ఇలియానాను ఒప్పిస్తేనే కాల్షీట్లు ఇస్తామని షరతులు పెడుతున్నారు. దీనితో నిర్మాతలకు పెద్ద సమస్య వచ్చి పడింది.


Click it and Unblock the Notifications











