పోకిరి తమిళ వెర్షన్‌లో ఇలియానా!
పోకిరి తమిళ వెర్షన్‌లో విజయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరి హీరోయిన్ ఎవరు? ఆసిన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని విజయ్ మొదట అనుకున్నప్పటికీ ఆయన చివరికి ఇలియానా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తెలుగులో తెగ బిజీగా ఉన్న ఇలియానా విజయ్ సరసన నటించడానికి అంగీకరించడం విశేషం. ఇలియానా కాల్షీట్లు దొరకవేమోనన్న అనుమానంతో విజయ్ మలయాళం నటి భావన కోసం ప్రయత్నించినట్టు తెలిసింది. ఆమె కూడా అక్కడ బిజీగా ఉండడంతో చివరికి ఇలియానాను సంప్రదించడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయాయి. ఇలియానా తమిళంలో చేసిన తొలి సినిమా జాదూ. ఇది ఆమె రెండో సినిమా అవుతుంది. ఇలా ఉండగా తమిళంలో కూడా దీనికి పోకిరి అనే టైటిల్‌ను పెట్టినట్టు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications