twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియాని వెర్రి వెధవలని చేస్తున్న ఇలియానా

    By Srikanya
    |

    ''ఫిజియోథెరపిస్టునీ, వైద్యుల్ని సంప్రదించాం. రెండుమూడు రోజులు విశ్రాంతి అవసరమన్నారు. ఇలియానా కోలుకొంది. రేపట్నించే షూటింగ్ కు వెళ్తానని అంటోంది. షూటింగ్ వాయిదా వేయొద్దని కూడా సూచించిందని చెప్పింది అంటూ ఇలియానా తల్లి సమీరా డిక్రూజ్‌ రెండు రోజుల క్రితం తన కూతురు యాక్సిడెంట్ గురించి ఓ లీడింగ్ న్యూస్ పేపర్ వారికి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అస్సలు తనకు యాక్సిడెంటే జరగలేదంటూ ఇలియానా చెప్తోంది.అదంతా మీడియా క్రియోట్ చేసిన హంగామా అని బేస్ లెస్ రూమర్స్ అని కొట్టిపారేసింది. దాంతో ఈ వార్త విన్నవారంతా షాక్ అయ్యారు. మరో ప్రక్క నృత్య దర్శకురాలు ఫర్హా ఖాన్ కూడా ఈ వార్తను ధృవీకరిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఎవరు చెప్పేది నిజం ..ఏది అబద్దం అనేది తెలియకుండా పోయింది. ఇదంతా గురువారం ఆమె చెన్నైలో తమిళ చిత్రం నన్బన్‌ (త్రీ ఇడియట్స్‌ రీమేక్‌)కి సంబంధించిన పాట కోసం ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకొందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎలా సాగాయంటే...ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్‌ ఆధ్వర్యంలో ఇలియానా ప్రాక్టీస్‌ చేస్తోంది.

    ఓ భంగిమ కోసం ప్రయత్నిస్తుండగా ఆమె అదుపు తప్పి పడిపోయింది. చీలమండ భాగంలో గాయమైంది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ నృత్యదర్శకత్వంలో శంకర్ ఈ పాటను చిత్రీకరించాలనుకున్నారు. ఇలాంటి పాట హిందీ వెర్షన్‌లో లేదు. ఈ పాట కోసం చెన్నయ్‌లో ఓ భారీ సెట్ రూపొందించారు. పాట బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఫరాఖాన్‌ని తీసుకున్నారు. ఆమె సమకూర్చిన స్టెప్స్ కొత్తగా ఉండటంతో పాటు కొంచెం క్లిష్టంగా కూడా ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ ఇలియానా ఎంతో పట్టుదలతో వాటిని నేర్చుకోవడం మొదలుపెట్టారని, ఆ సమయంలోనే కాలు స్లిప్ అయ్యి పడ్డారని చెప్తున్నారు. ఆల్రెడీ ఇలియానా చీలమండల పరిస్థితి దుర్భరంగా ఉండటంతో, డాన్స్ చేస్తున్నప్పుడు మరింత ఒత్తిడి పడటంవల్లే ఆమె జారిపడ్డారని తెలుస్తోంది. తనకు తెలిసిన ఫిజియోథెరపిస్ట్‌ని ఇలియానాకు పరిచయం చేసి, ఆమెకు ఫిజియోథెరపీ చేయించారట ఫరాఖాన్. ఇంతకీ ఇలియానా పడిందా లేదా అన్నది మీడియా వర్గాల్లో ఇప్పుడు చర్చగా మారింది.

    English summary
    Tollywood was buzzing with news that Ileana, who is reprising the role of Kareena Kapoor in Nanban, (a remake of Bollywood blockbuster 3 Idiots) fractured her leg while practicing a dance step for the film.When contacted Ileana, her aides rubbished the reports as baseless.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X