ఔట్ డోర్ షూటింగుల్లో ఇలియానా బిజినెస్ ...!
గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు షూటింగుల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతుంటే 'స్వామి కార్యం, స్వకార్యం' అన్నట్టుగా రెండు పనులు చక్కబెట్టుకుని వస్తోంది. ఈమధ్య 'త్రీ ఇడియేట్స్' తమిళ రీమేక్ షూటింగ్ కోసం కోవై (కోయంబత్తూర్) వెళ్లినప్పుడు కూడా అలాగే చేసిందట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆమధ్య తను హైదరాబాదులో 'ఇలియానా' పేరుతో బోటిక్ ఒకటి ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే కదా. అందు కోసం, ఇప్పుడు తను ఎక్కడికెళితే అక్కడి నుంచి డ్రేసేస్ కొనుక్కుని వస్తోందట.
అలాగే, కోవైలో కూడా రెండు రోజుల పాటు మధ్యాహ్నం వేళ వెళ్లి, ఓ వస్త్ర దుకాణంలో రకరకాల దుస్తులు కొనుగోలు చేసింది. వాటిలో హ్యాండ్ లూమ్, సిల్క్ వస్త్రాలు ఎక్కువగా వున్నట్టు చెబుతున్నారు. ముందు ముందు టచ్ లో ఉండడానికి ఆయా వస్త్రాల డీలర్ల గురించి కూడా ఎంక్వయిర్ చేసిందట. ఇలా ఇలియానా ఎక్కడికెళ్ళినా తన బిజినెస్ ని మాత్రం మరచిపోవడం లేదు!


Click it and Unblock the Notifications











