Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఇలియానా ప్రమాదం గురించి ఆమె తల్లి...
హీరోయిన్ ఇలియానా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆమె కాలికి స్వల్ప గాయమైంది. ఈ విషయమై ఆమె తల్లి సమీరా డిక్రూజ్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఫిజియోథెరపిస్టునీ, వైద్యుల్ని సంప్రదించాం. రెండుమూడు రోజులు విశ్రాంతి అవసరమన్నారు. ఇలియానా కోలుకొంది. రేపట్నించే షూటింగ్ కు వెళ్తానని అంటోంది. షూటింగ్ వాయిదా వేయొద్దని కూడా సూచించిందని చెప్పింది. ఇక గురువారం ఆమె చెన్నైలో తమిళ చిత్రం నన్బన్ (త్రీ ఇడియట్స్ రీమేక్)కి సంబంధించిన పాట కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకొంది. ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ ఆధ్వర్యంలో ఇలియానా ప్రాక్టీస్ చేస్తోంది. ఓ భంగిమ కోసం ప్రయత్నిస్తుండగా ఆమె అదుపు తప్పి పడిపోయింది. చీలమండ భాగంలో గాయమైంది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ నృత్యదర్శకత్వంలో శంకర్ ఈ పాటను చిత్రీకరించాలనుకున్నారు. ఇలాంటి పాట హిందీ వెర్షన్లో లేదు.
ఈ పాట కోసం చెన్నయ్‌లో ఓ భారీ సెట్ రూపొందించారు. పాట బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఫరాఖాన్ని తీసుకున్నారు. ఆమె సమకూర్చిన స్టెప్స్ కొత్తగా ఉండటంతో పాటు కొంచెం క్లిష్టంగా కూడా ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ ఇలియానా ఎంతో పట్టుదలతో వాటిని నేర్చుకోవడం మొదలుపెట్టారని, ఆ సమయంలోనే కాలు స్లిప్ అయ్యి పడ్డారని చెప్తున్నారు. ఆల్రెడీ ఇలియానా చీలమండల పరిస్థితి దుర్భరంగా ఉండటంతో, డాన్స్ చేస్తున్నప్పుడు మరింత ఒత్తిడి పడటంవల్లే ఆమె జారిపడ్డారని తెలుస్తోంది. తనకు తెలిసిన ఫిజియోథెరపిస్ట్‌ని ఇలియానాకు పరిచయం చేసి, ఆమెకు ఫిజియోథెరపీ చేయించారట ఫరాఖాన్. ఇలియానా పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఫరాఖాన్ పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఈ పాట స్టెప్స్‌ని ఇలియానాకు, ఇతర బృందానికి చెప్పే క్రమంలో ఫరాఖాన్ గట్టిగా అరవడంతో ఆమె గొంతు బొంగురుపోయింది. ఈ విషయం గురించి ఫరా చెబుతూ ఎలాగూ ఈ షూటింగ్ వాయిదా పడింది కాబట్టి.. మళ్లీ ఆరంభించే లోపు నా గొంతు మామూలు స్థితికి వచ్చేస్తుందనుకుంటున్నా అంది.