జాతీయ ఉత్తమ నటుడి సరసన ఇలియానా
ఇలియానా కెరీర్ మరో ముందడగు వేసింది. తాజాగా ఆమె జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ సరసన కమిట్ అయ్యింది. 13బి వంటి ధ్రిల్లర్ డైరక్ట్ చేసిన విక్రమ్ కుమార్ ఆ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. తమిళంలో ఆమె దాదాపు మూడేళ్ళ అనంతరం ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. అప్పట్లో ఆమె రవికృష్ణ సరసన చేసిన చిత్రం ఫ్లాఫ్ అవటంతో ఆమె మళ్లీ అక్కడ సినిమాలు చేయలేదు. అయితే మంచి ఎమౌంట్ ఆమెకి ఆఫర్ చేయటంతో ఈ చిత్రం ఒప్పుకుందని సమాచారం. ఇక ఆమె చేసిన సలీం చిత్రం మొన్న శనివారం రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అంతకు ముందు నితిన్ సరసన చేసిన రెచ్చిపో చిత్రం కూడా అదే డిజాస్టర్ బాటలో ప్రయాణించింది. ఈ పరిస్ధితుల్లో వచ్చిన ఆఫర్ ఏ బాషదైనా రెమ్యునేషన్ బాగుంటే ఒప్పుకుంటోందని అంటున్నారు. అందులోనూ మొదట సినిమా 13బితో విక్రమ్ కుమార్ సంచలనం సృష్టించాడు. ఇక విక్రమ్ నటన సంగతి చెప్పేదేముంది.
విక్రమ్ ఇలియానా మాధవన్ నీతూచంద్ర రవికృష్ణ సలీం వైవియస్ చౌదిరి vikram ileana madhavan neethu chandra ravi krishna saleem


Click it and Unblock the Notifications