దాంతో భయం పట్టుకుంది...ఇలియానా
ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడటంతో సెంటిమెంట్‌గా కొత్త భయం పట్టుకుంది. అందుకే ఇకపై తమిళంలో సినిమాలు చేయాలా? వద్దా? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను" అంటోంది ఇలియానా. ఆమె కమిటయిన విక్రమ్ కాంబినేషన్ తమిళ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడటం, అస్సలు షూటింగ్ స్టార్టవుతుందా లేదా అన్న డైలమో కలగటంతో ఇలియానా ఈ రకంగా చెప్తోంది. ఆమె కెరీర్ ప్రారంభంలో రవికృష్ణ(సెవన్ బై జీ బృందావన్ కాలనీ హీరో) తో చేసిన 'జాదు' చిత్రం డిజాస్టర్ అయింది. దాంతో ఆ తర్వాత ఆమెకు తమిళంలో ఆఫర్స్ రాలేదు. అరకొరా వచ్చినా తెలుగులో బిజీగా ఉన్నాం కదా అని ఆమె ఒప్పుకోలేదు. అయితే ఇటీవలే విక్రమ్ తో కలిసి నటించే చిత్రానికి కాల్షీట్లు ఇచ్చింది.
ఈ విషయాన్నే ఇలియానా మీడియాకు చెబుతూ "మేకప్ వేసుకున్న ప్రతి సినిమా విజయం సాధిస్తున్న సమయంలో నేను చవిచూసిన తొలి ఫ్లాప్ అది. దాంతో బాగా కంగారువచ్చింది. సరిగ్గా అదే సమయంలో తెలుగులో మంచి చిత్రాలు దక్కాయి. క్రమంగా ఆ బాధని మరచిపోయాను. తర్వాత పలువురు తమిళ దర్శకనిర్మాతలు సంప్రదించినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య విక్రమ్ సినిమా చేయమన్నారు. లేనిపోని భయాలతో మంచి అవకాశాన్ని చేజార్చుకోవడం ఇష్టం లేక ఒప్పుకున్నాను. నిజానికి సంతకం చేయడానికి ముందు చాలాసార్లు ఆలోచించాను. ఈ సినిమా చిత్రీకరణ కూడా వాయిదా పడటంతో సెంటిమెంట్‌గా కాస్త భయం ఎక్కువయింది. అంటోందీ ఇలియానా.ఇలియానా ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి శక్తి చిత్రంలో చేస్తోంది. మెహర్ రమేష్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











