twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను చేసిన సినిమా ఫ్లాప్‌ అయితే...ఇలియానా

    By Srikanya
    |

    ఒకవేళ నేను చేసిన సినిమా ఫ్లాప్‌ అయితే బాధపడిపోయేదాన్ని. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో హిట్టు ప్లాప్ లకు విపరీతంగా స్పందించేదాన్ని. రాను రాను జయాపజయాలు మన చేతుల్లో ఉండవని తెలుసుకున్నాను. అప్పట్నుంచి నా పాత్ర మీద మాత్రమే దృష్టి పెడుతున్నాను. ఏ పాత్ర చేసినా అందుకు పూర్తి న్యాయం చేయడానికి కృషి చేస్తున్నాను అంటోంది ఇలియానా. అలాగే షూటింగ్స్‌ లేనప్పుడు గోవాలో మా ఇంటిపట్టున ఉండి హాయిగా సేద తీరతాను. షూటింగ్స్‌ ఉంటే అలుపు, సొలుపు లేకుండా పని చేస్తాను. సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. నేనెవర్నీ పోటీగా తీసుకోను. నాతో నేను పోటీపడతాను అని గర్వంగా చెపుతోంది. అలాగే ఈ మధ్యకాలంలో కొత్త కథానాయికలు చాలామంది వచ్చారు. కొంతమంది సెటిలయ్యారు. మరికొంతమంది ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరి...సెటిలైనవారితో మీకు గట్టి పోటీ ఎదురవుతుందా అంటే...జీవితంలో పోటీ లేకపోతే మజా ఉండదు అని బదులిచ్చింది. ఇక ఇలియానా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతోంది. ఈ నాలుగేళ్లల్లో దాదాపు 13 సినిమాలు చేశారు ఇలియానా. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు, ఓ తమిళ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారామె. తెలుగులో 'శక్తి' చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్నారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. తమిళంలో విక్రమ్‌ సరసన 'వెడి' అనే చిత్రంలో నటిస్తున్నారామె. ఈ చిత్రానికి భూపతి పాండ్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X