డైరక్టర్ మీద కోపంతోనే ఇలియానా
ఇలియానా తన తాజా చిత్రం దర్శకుడు శంకర్ పై కోపంగా ఉందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ లో ప్రచారమవుతోంది. త్రీ ఇడియట్స్ రీమేక్ గా రూపొందుతున్న నన్భన్ చిత్రం ఆడియో ఫంక్షన్ రీసెంట్ గా కోయింబత్తూర్ లో జరిగింది. ఆ ఫంక్షన్ కి ఇలియానా హాజరు కాలేదు. అయితే కారణం మాత్రం ఎవరికీ తెలియలేదు. అలాగని ఆమె వేరే చిత్రం షూటింగ్ లోనూ బిజీగా లేదు. దాంతో శంకర్ పై ఆమె కోపం తెచ్చుకుందని అందుకే ఫంక్షన్ కి హాజరు కాలేదని చెప్తున్నారు. చిత్రంలో ఆమె పాత్రను పెంచుతానని చెప్పి డేట్స్ తీసుకుని అలాంటిదేమీ చెయ్యలేదని ఆమె భాధపడుతోందిట. అయితే శంకర్ మాత్రం హీరోయిన్ కోసమో మరెవరి కోసమో స్క్రిప్టుకి అన్యాయం చేయలేనని ఖచ్చితంగా చెప్పాడని చెప్పుకుంటున్నారు.
కానీ ఇలియానా కు చెందిన వారు మాత్రం అంటువంటిదేమీ లేదని కేవలం ఆమె కు ఫ్లూ జ్వరం రావటం వల్లే ఆడియో ఫంక్షన్ కి రాలేకపోయిందని అంటున్నారు. బర్ఫీ షూటింగ్ లో పాల్గొన్న ఆమె గత కొద్ది రోజులుగా జ్వరంతో భాధపడుతోందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఆమె హిందీలో కరీనా కపూర్ వేసిన పాత్రను చేస్తోంది. హిందీలోనూ హీరోయిన్ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. కథలో పెద్దగా కలిసే పాత్ర కాదు అది. హీరోల ముగ్గురు చుట్టూనే తిరిగే కథ అది.


Click it and Unblock the Notifications











