ఇళయరాజాగారు నాకు వాయిస్ ఇచ్చారు
అలాగే...వైవిధ్యంగా ఉంటే నాకు తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా ఒకటే. వైవిధ్యంగా ఉండబట్టే 'ఒక విచిత్రం' తర్వాత ఇప్పుడు తెలుగులో 'గుండెల్లో గోదారి' చేశా. ఇందులో నా పేరు మల్లేశ్. అందరూ మల్లిగాడని పిలుస్తారు. చేపలు పట్టేవాడి పాత్ర. గోదావరి యాస మాట్లాడతాడు. చాలా మంచోడు. నావ (పడవ) కొనుక్కోవాలనేది మల్లిగాడి కల. ఆ పాత్ర కోసం వలేసి చేపలు పట్టడం నేర్చుకున్నా. షూటింగ్‌కి రెండు వారాల ముందు అక్కడకి వెళ్లి అక్కడి జాలర్లతో కలిసి మెలిసి తిరిగా. వాళ్లు ఎలా మాట్లాడతారో చూసి, వాళ్ల జీవనశైలి అర్థం చేసుకొని, వాళ్ల శారీరక భాషను అవగతం చేసుకుని, సినిమాలో మల్లిగాడుగా మారిపోయా అన్నారు.
ఇక చిత్రం కధ గురించి మాట్లాడుతూ...ఉప్పెన మధ్య ప్రేమకథ ఎంతోమంది జీవితాల్ని అతలాకుతలం చేసిన దివిసీమ ఉప్పెన సందర్భంగా ఓ రాత్రి జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 'టైటానిక్' ఓడ మునిగిపోయే సంఘటనకి ఓ ప్రేమకథని ఎలా జోడించారో, ఈ సినిమాలోనూ ఓ అందమైన ప్రేమకథని జోడించారు. డ్రామా ఆసక్తికరంగా ఉంటుంది. నేను, తాప్సీ ఓ జంటగా, అలాగే లక్ష్మి, నేను ఇంకో జంటగా నటిస్తున్నాం. అదేమిటన్నది సినిమాలోనే చూడాలి. ఇప్పటిదాకా ఉప్పెనను ఈ సినిమాలో మాదిరిగా ఎవరూ చూపించలేదు. గోదావరి నీళ్లలో ఆ సన్నివేశాలు తీశారు. డైరెక్టర్ కమర్షియల్ అంశాల్నీ చాలా చక్కగా ఇమిడ్చారు అన్నారు.
నిర్మాత లక్ష్మి ప్రసన్న గురించి చెపుతూ..లక్ష్మీప్రసన్న సమర్థురాలు మోహన్‌బాబు అంకుల్ ఫ్యామిలీతో అసోసియేట్ అవడం సంతోషంగా ఉంది. ఓ నిర్మాతగా, నటిగా రెండు క్లిష్టమైన పనుల్ని ఎంతో సమర్థతతో చేస్తోంది లక్ష్మీప్రసన్న. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను గొప్పగా చేసింది. అలాగే తాప్సీది ఎవరూ ఊహించలేని పాత్ర. ఆమె క్యారెక్టరైజేషన్ క్లిష్టమైందయినా ఎంతో సునాయాసంగా చేసేసింది. తమిళంలోనూ ఈ సినిమాని ఏక కాలంలో చిత్రీకరించారు. ఆ వెర్షన్ కోసం కొన్ని సీన్లు మార్చారు. గొప్ప అనుభవం ప్రస్తుతం రజనీకాంత్‌గారి 'కోచ్చడయాన్' చేస్తున్నా. తెరమీద సూపర్‌స్టార్ అయినా బయట చాలా మామూలు మనిషిలా ఉంటారు రజనీకాంత్. ఆయనతో కలిసి స్క్రీన్ పంచుకోవడం గొప్ప అనుభవం అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












