హీరో సూర్య, సన్నిహితుల ఇళ్లపై ఐటి దాడులు
చెన్నై: హీరో సూర్య ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన దాడులు మధ్యాహ్నం రెండు వరకు కొనసాగాయి. సూర్య సన్నిహితుల ఇళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. సూర్య టి నగర్ ఇంటిమీద, బోట్ క్లబ్ ఏరియాలోని బంగ్లా మీద, కొన్ని కార్యాలయాలు, సమీప బంధువుల ఇళ్లను కూడా ఐటి అధికారులు సోదా చేశారు.
ఇంకా దర్శకుడు కెఎస్.రవికుమార్, గజిని దర్శకుడు ఎఆర్ మురుగదాస్, సింగం దర్శకుడు హరి, సూర్య కజిన్ గ్నానవేల్ రాజా ఇళ్ళపై కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సూర్య పెట్టిన చారిటీ ట్రస్ట్ అగరం ఫౌండేషన్ కార్యాలయాన్ని కూడా ఐటి వారు విడిచిపెట్టలేదు. విజయ్ టీవీ, అగరం ఫౌండేషన్ విద్యార్ధుల కోసం "విధై" అనే కార్యక్రమాన్ని ప్రకటించిన నాలుగురోజులకే ఈ దాడులు జరగడం గమనార్హం.
సూర్య గజిని ఆదాయపు పన్ను దాడులు మురుగదాస్ సింగం హరి surya ghajini income tax raid murugadas singam hari


Click it and Unblock the Notifications