twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాత నివాసాలు, ఆఫీసులపై ఐటీ దాడులు.. ఏకకాలంలో పదిచోట్ల సోదాలు

    |

    తమిళ సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రముఖ ప్రొడ్యూసర్​ ఇంటిపై ఐటీ దాడులు చేసింది. ఇక ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశం అయింది. దానికి కారణం ఆయన మీద ఐటీ ఇలా దాడి చేయడం మొదటి సారి కాదు. ఆయన మీద గతంలోనే పలు మార్లు రైడ్స్ జరిగాయి. ఇక దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    గోపురం ఫిలిమ్స్ పేరుతో

    గోపురం ఫిలిమ్స్ పేరుతో

    చెన్నై, మధురై సహా మొత్తం 40 చోట్ల అన్బు చెళియన్​కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. చెన్నైలోని నుంగంపాక్కం కమ్దార్ నగర్‌లోని ఇల్లు, టి.నగర్ రాఘవయ్య స్ట్రీట్‌లోని కార్యాలయం సహా తమిళనాడు వ్యాప్తంగా 40 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చెన్నై మదురై, తేని, కాంచీపురం, తిరువళ్లూరు మదురై మేళా మాసి కార్యాలయం, కీరైతురై, తెప్పకులం తదితర 40 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు.

    తమిళ సినిమాలకు

    తమిళ సినిమాలకు

    అన్బు చెళియన్​.. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫైనాన్షియర్ అని చెబుతున్నారు. అలాగే ఆయన గోపురం ఫిలిమ్స్ పేరుతో కొన్ని సినిమాలు చేశారని అంటున్నారు. అలాగే సినిమాలు డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. విజయ్​ నటించిన బిగిల్​ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఏజీఎస్​ ఎంటర్​టైన్​మెంట్​కు ఆయన ఆర్థిక వనరులు సమకూర్చారని తెలుస్తోంది.

    వేధింపుల కారణంగా

    వేధింపుల కారణంగా

    మదురైలో స్థిరపడిన అన్బు చెళియన్ అనేక తమిళ సినిమాలకు ఫైనాన్షియర్ గా ఉన్నారు. సినిమాల నిర్మలకు అప్పులు ఇచ్చి వాటి రికవరీ విషయంలో వేధింపుల ఆరోపణలతో ఆయన గతంలోకి వార్తలలోకి ఎక్కారు. అప్పు తీర్చినప్పటికీ అన్బు చెళియన్ తనను బెదిరిస్తున్నాడని నిర్మాత ఫిర్యాదుపై 2011లో ఒకసారి అరెస్టయ్యాడు. ఇంకా, నవంబర్ 2017 లో, దర్శకుడు శశికుమార్ బంధువు అశోక్ కుమార్ అన్బు చెళియన్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన మరోమారు వార్తల్లోకి ఎక్కారు.

    38 చోట్ల

    38 చోట్ల

    అయితే ఇన్ని ఆరోపణలు ఉన్నా ఆయన కోలీవుడ్‌లో ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నారు. అగ్ర హీరోలు నటించే అనేక భారీ బడ్జెట్ సినిమాలకు ఆర్థిక సహాయం చేస్తాడని అంటున్నారు. ఇటీవల ఆయన కుమార్తె పెళ్ళికి రజనీకాంత్ సహా పలువురు స్టార్ హీరోలు హాజరయ్యారు అంటే అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఫిబ్రవరి 5, 2020న, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు బడా వ్యక్తులు ఆదాయపు పన్ను అధికారుల దృష్టిలో పడ్డారు. ఆ సమయంలో తమిళనాడు అంతటా 38 చోట్ల సోదాలు నిర్వహించారు .

    2022 మార్చిలో

    2022 మార్చిలో

    కోలీవుడ్‌కు చెందిన నలుగురు ప్రధాన వ్యక్తులుగా చెబుతున్న విజయ్, అలాగే ఆయనకు సన్నిహతుడు డిస్ట్రిబ్యూటర్ సుందర్ ఆరుముగం, AGS గ్రూప్ నిర్మాత, కోలీవుడ్ టాప్ ఫైనాన్షియర్ అన్బు చెళియన్ లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఆ సమయంలో, మీడియా దృష్టి మొత్తం పన్ను దాడులపై ఎక్కువగా కేంద్రీకరించబడింది. ఆ తరువాత చెళియన్ తో వ్యాపార లావాదేవీలు జరిపిన తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు నిర్మాతలకు పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ 2022 మార్చిలో నోటీసులు అందజేసింధీ.

    75 కోట్ల రూపాయల వరకు

    75 కోట్ల రూపాయల వరకు

    నిర్మాతలు అన్బు చెజియన్ నుండి 6 కోట్ల రూపాయల నుండి 75 కోట్ల రూపాయల వరకు అప్పుగా తీసుకున్న డబ్బు గురించి వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారే అయ్యాయి. చెళియన్తో వ్యాపార లావాదేవీలు జరిపిన నిర్మాతలలో ఎక్కువ మంది ఇన్‌కమ్ ట్యాక్స్ స్కానర్ కిందకు వచ్చారు. ఫైనాన్షియర్ నుండి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా డిపార్ట్‌మెంట్ నుండి నోటీసులు అందుకున్నారు.

    English summary
    Income Tax raids on Tamil producer Anbu Chezliyani, Raids are being conducted in 40 places across Tamil Nadu, including a house in Nungampakkam Kamdar Nagar in Chennai and an office in T. Nagar Raghavaya Street.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X