స్టార్ హీరో ఇంటిపై ఐటి దాడులు.. ముఖం చాటేస్తున్న సన్నిహితులు!

సెలెబ్రిటీల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ విభాగం అధికారులు దాడులు జరిపితే అది మీడియాలో ప్రధానాంశంగా మారుతుంది. అలాంటి సంచలన ఘటనే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విషయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన పాత్రలలో నటిస్తూ విజయ్ సేతుపతి తమిళంలో ప్రధాన హీరోగా ఎదిగాడు. విజయ్ సేతుపతి నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం నవాబ్ మంచి టాక్‌తో దూసుకుపోతోంది.

ఆశ్చర్యంలో కోలీవుడ్

ఆశ్చర్యంలో కోలీవుడ్

విజయ్ సేతుపతి తనపని తాను చేసుకుపోయే నటుడు. అలాంటి హీరో ఇంటిపై ఐటి దాడులు జరగడంతో తమిళ సినీవర్గాల్లో ఆశ్చర్యం నెలకొంది. కొన్ని రోజులు క్రితం జరిగిన ఈ ఘటన ఆయన సన్నిహితుల ద్వారా తాజగా వెలుగులోకి వచ్చింది. తమిళ సినీవర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఇంట్లో లేని సమయంలో

ఇంట్లో లేని సమయంలో

విజయ్ సేతుపతి ఇంటిపై ఐటి దాడులు 3 రోజుల క్రితం జరిగాయట. ఆ సమయంలో విజయ్ సేతుపతి చెన్నై నగరంలోనే లేరని అంటున్నారు. ఆయన సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఇది సాధారణంగా జరిగిన ఐటి సోదాలు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆదాయపు పన్ను విభాగం

ఆదాయపు పన్ను విభాగం

కానీ ఐటి విభాగం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తమ విధుల్లో భాగంగా రొటీన్ గా నిర్వహించిన రైడ్ అని అంటున్నారు. ఐటి విభాగం అధికారులు రొటీన్ అని చెబుతున్నా విజయ్ సన్నిహితులు మాత్రం షాక్ లో ఉన్నారు. ఐటి దాడులు ఉన్నపళంగానే జరుగుతాయి. కానీ విజయ్ సేతుపతి లాంటి నటుడిపై రైడ్స్ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే చర్చ కూడా జరుగుతోంది.

 ముఖం చాటేస్తున్నారు

ముఖం చాటేస్తున్నారు

ఐటి దాడుల గురించి విజయ్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. కానీ సోదాలలో అధికారులు ఏమైనా స్వాధీనపరుచుకున్నారా అనే ప్రశ్నకు మాత్రం ముఖం చాటేస్తున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే విజయ్ సేతుపతి స్పందించాల్సిందే.

Recommended Video

Nawab Movie Twitter Review నవాబ్ చిత్రం ట్విట్టర్ రివ్యూ
రసూల్‌గా అద్భుత నటన

రసూల్‌గా అద్భుత నటన

విజయ్ సేతుపతి నటించిన మణిరత్నం చిత్రం నవాబ్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రసూల్ పాత్రలో విజయ్ అద్భుత నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మరో వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం పెట్టలో, మెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరా నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి కీలకమైన పాత్రల్లో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X