షాక్ కానీ నిజమే... : మన తెలుగు పోలీసుల దారుణాల కథకే ...ఆస్కార్ బరిలో చోటు

By Srikanya

చెన్నై: తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన 'విసారణై' మూవీ 2017కుగాను ఆస్కార్ నామినేషన్లలో చోటు సంపాదించుకుంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో భారత్ నుంచి ఈ మూవీ ఆస్కార్‌కు ఎంపికైంది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసులు.. తమిళనాడుకు చెందిన నలుగురు అభాగ్యుల్ని అన్యాయంగా కేసులో ఇరికించి విచారణ పేరుతో పోలీస్‌ స్టేషన్లో విపరీతమైన హింసకు గురిచేయడానికి సంబంధించిన కథ ఇది. పోలీసుల దాష్టీకానికి సంబంధించిన సన్నివేశాల్ని హృదయ విదారకంగా తెరకెక్కించాడట వెట్రిమారన్‌.

పోలీసుల చుట్టూ తిరిగే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు రావడమే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా విడుదలకు ముందే 72వ వెనీస్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లడం విశేషం. విసారణై 2015లో విడుదలైంది.

మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో..

గుంటూరు హోటల్ చేసే ..

గుంటూరు హోటల్ చేసే ..

వాస్తవిక అంశాలకు దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వెట్రిమారన్. ఈ సినిమాకు కథను అందించిన చంద్రకుమార్ ఓ ఆటోడ్రైవర్ కావడం విశేషం. తమిళనాడుకు చెందిన చంద్రకుమార్.. ఒకప్పుడు గుంటూరులో హోటల్ లో పనిచేసేవాడట. ఆ సమయంలోనే ఓ కేసు విషయమై చంద్రకుమార్ తో పాటు మరో నలుగురు అమాయకుల్ని... అక్కడి పోలీసులు ఓ కేసులో ఇరికించి నాలుగు నెలల పాటు చిత్రహింసలు పెట్టారట.

లాకప్ పేరుతో పుస్తకంలో

లాకప్ పేరుతో పుస్తకంలో

ఆపై నిర్దోషిగా బయటకు వచ్చిన చంద్రకుమార్.. తమిళనాడు వెళ్లి మధురైలో ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే స్వతహాగా రచనాసక్తి ఉన్న చంద్రకుమార్.. తనకు ఎదురైన అనుభవాలనే లాకప్ పేరుతో పుస్తకంగా రాశాడు. లాకప్ పుస్తకంలోని వాస్తవిక అంశాలు నచ్చడంతో.. దర్శకుడు వెట్రిమారన్ ఈ కథను సినిమాగా తెరకెక్కించాడు. ఏదైతేనేం.. మొత్తానికి ఆటోడ్రైవర్ కాస్తా ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ పుణ్యమా అని అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు.

అక్కడ కూడా అవార్డ్ లు

అక్కడ కూడా అవార్డ్ లు

వెనిస్ చలన చిత్రోత్సవంలో హ్యూమన్ రైట్స్ మీద తీసిన బెస్ట్ మూవీగా అవార్డు అందుకున్న నాటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. ఆ తర్వాత కూడా కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన ఈ చిత్రం ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా అందుకుంది.

తెలుగోళ్లు నటించారు

తెలుగోళ్లు నటించారు

తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దినేష్, ఆడుకాలం మురుగదాస్, సముద్రఖని, కిశోర్ తో పాటు.. అజయ్ ఘోష్ ప్రధానపాత్రలు పోషించారు. ఈ సినిమా స్టోరీని ఓ ఆటోడ్రైవర్ రాయడం విశేషం.

రజనీకాంత్ చూసి అద్బుతం

రజనీకాంత్ చూసి అద్బుతం

‘విసారణై' చూసిన వాళ్లందరిదీ ఒకటే మాట.. అద్భుతమైన సినిమా అని. స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఈ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించారు. తాను ఇన్నేళ్లలో చూసిన సినిమాలన్నింట్లో ఇదే బెస్ట్ మూవీ అని కితాబిచ్చేశారంటేనే ఆ సినిమా గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కమల్, మణిరత్నం సైతం

కమల్, మణిరత్నం సైతం

కమల్ హాసన్ - ప్రియదర్శన్ - మణిరత్నం లాంటి లెజెండ్స్ అంతా కూడా ఈ సినిమాను గొప్పగా పొగిడారు. మీడియా వాళ్లు కూడా ఇది అద్భుతమైన సినిమా అంటూ రివ్యూలు రాశారు. దాంతో ఈ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ సిని మా సక్సెస్ కు కూడా ఉపయోగపడింది.

డైరక్టర్ ని నమ్మాడు

డైరక్టర్ ని నమ్మాడు

ధనుష్ కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఆడుగళం' సినిమాను డైరెక్ట్ చేసిన వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకుడు. వెట్రిమారన్ తో కలిసి ధనుషే ఈ చిత్రాన్ని నిర్మించాడు. మధురైకి చెందిన ఓ ఆటోవాలా తన నిజ జీవిత అనుభవాలతో రాసిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

డబ్బింగ్ తో మనకు కూడా..

డబ్బింగ్ తో మనకు కూడా..

విశారణై చిత్రాన్ని విచారణ పేరుతో కల్పనా చిత్ర సంస్థ తెలుగులోకి అనువదిస్తోంది. ది క్రైమ్ ఉపశీర్షిక. సి.కల్యాణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దినేష్, ఆనంది, కిషోర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకుడు. సి.కల్యాణ్ మాట్లాడుతూ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు చక్కటి వసూళ్లను సాధించిన చిత్రమిది. ఓ కేసు విచారణలో భాగంగా ఐదుగురు యువకులకు ఎదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం సహజంగా సాగుతుంది అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X