శంకర్‌కు సమన్లు.. పోలీసుల విచారణకు సంచలన దర్శకుడు
ఇండియన్ 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదం సంఘటన దర్శకుడు శంకర్‌ను వదిలేటట్టు కనిపించడం లేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులు మరోసారి విచారణకు హాజరుకావాలని శంకర్‌తోపాటు మరో ముగ్గురు యూనిట్ సభ్యులకు నోటీసులు జారీ చేశారు.
బుధవారం మార్చి 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఈవీపీ ఫిల్మ్ సిటీ ప్రాంగణంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ విచారణ నుంచి కమల్ హాసన్‌ను మినహాయించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. తనను ఈ కేసులో వేధిస్తున్నారని కోర్టులో కమల్ పిటిషన్ వేయడంతో కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.

ఇండియన్ 2 సినిమాకు సంబంధించి కీలకమైన యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ క్రేన్ విరిగి పడి ముగ్గురు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చెన్నై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా అనుమానాస్పద కారణమేమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇండియన్ 2 ప్రమాదం జరిగినప్పడు సంఘటనా స్థలంలో హీరో కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తదితరులు కూడా అక్కడే ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి వీరిద్దరూ తృటిలో బయటపడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











