twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Indian 2 వివాదం కొత్త మలుపు.. శంకర్ తప్పని చిక్కులు? రాంచరణ్‌ పరిస్థితి ఏంటో!

    |

    కోలీవుడ్‌లో దర్శకుడు శంకర్, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు జరుగుతున్న న్యాయపోరాటం మరో మలుపు తిరిగింది. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరో, హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకులు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటంటే...

    ఇండియన్ 2 షూటింగుకు పలు అడ్డంకులు

    ఇండియన్ 2 షూటింగుకు పలు అడ్డంకులు

    గతంలో సంచలన విషయం సాధించిన భారతీయుడు (తమిళంలో ఇండియన్) సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2 చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా దర్శకుడు శంకర్ ప్రారంభించారు. కొద్ది రోజులపాటు సజావుగా సాగిన తర్వాత కమల్ మేకప్ వ్యవహారం కుదరకపోవడం, అలాగే షూటింగులో క్రేన్ కూలి భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో సినిమా నిర్మాణం నిరవధికంగా వాయిదా పడింది.

    రాంచరణ్‌తో శంకర్ ప్రాజెక్ట్

    రాంచరణ్‌తో శంకర్ ప్రాజెక్ట్

    ఇండియన్ 2 షూటింగు ఆలస్యం కావడంతో దర్శకుడు శంకర్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగాస్టార్ రాంచరణ్‌తో కలిసి ప్యాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఇండియన్ 2 మూవీ షూటింగు పూర్తి చేసిన తర్వాతే రాంచరణ్ లేదా మరో సినిమా షూటింగును చేపట్టాలని సూచించారు. అయితే శంకర్ పెద్దగా పట్టించుకోకపోవడంతో లైకా మద్రాస్ కోర్టును ఆశ్రయించారు.

    ఇరుపార్టీలు తగిన నిర్ణయానికి...

    ఇరుపార్టీలు తగిన నిర్ణయానికి...

    దీంతో శంకర్, లైకా ప్రొడక్షన్ నిర్మాతలు, నిర్వాహకులు మధ్య భారీ గ్యాప్ ఏర్పడింది. ఈ కేసుపై కోర్టులో పలుమార్లు విచారణ జరిగిన తర్వాత ఇరుపార్టీలు ఓ సానుకూల నిర్ణయానికి వచ్చి తగు చర్యలు తీసుకోవాలి. తమ సమస్యను తామే పరిష్కరించుకొనేలా ఓ ఒప్పందానికి రావాలని సూచించింది. అయినా ఈ వివాదంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండటంతో కోర్టు మరో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

    మధ్యవర్తిగా రిటైర్డ్ జడ్జీ నియామకం

    మధ్యవర్తిగా రిటైర్డ్ జడ్జీ నియామకం


    రాంచరణ్‌తో తీయబోయ RC15 సినిమాకు ముందే ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేయాలని లైకా పట్టుబట్టని నేపథ్యంలో మద్రాస్ కోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఈ వివాదాన్ని పరిష్కరించేలా తగిన విధంగా మధ్యవర్తిత్వం జరుపాలని రిటైర్డ్ జడ్జీ భానుమతిని నియమంచారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగిందనే వాదనను తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    English summary
    Indian 2 movie legal battle between Director Shankar and Lyca Production took another turn. Both parties not come to Amicable Solution. Madras High Court appointed Retired Judge Bhanumathi as Arbitrator
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X