కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ఆగిపోలేదు... ఏం జరిగిందంటే?
Recommended Video

యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్, సౌతిండియా టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ కాంబినేషన్లో 23 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'భారతీయుడు 2'. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'భారతీయుడు'కి ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయింది.
శంకర్‌తో కలిసి 2.0 చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయినట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలిపోయింది.

అసలు ఏం జరిగిందంటే...
‘భారతీయుడు 2' చిత్రానికి సంబంధించి 2 షెడ్యూల్స్ ఇటీవలే చెన్నైలో పూర్తయ్యాయి. అయితే ఈ రెండు షెడ్యూల్స్ తర్వాత నెక్ట్స్ షెడ్యూల్ మొదలు కాకపోవడం, షూటింగుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేక పోవడంతో సినిమా ఆగిపోయిందనే వార్తలు తరపైకి వచ్చాయి.

మరి సినిమా మొదలయ్యేది ఎప్పుడు?
కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘భారతీయుడు 2' మూడో షెడ్యూల్ మళ్లీ మే చివరి వారంలో మొదలవుతుందట. కమల్ హాసన్ తన రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కమల్ హాసన్ కోరిక మేరకు లైకా ప్రొడక్షన్స్, శంకర్ షూటింగ్ ఎన్నికల తర్వాతే షూటింగ్ పెట్టుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లోకి రజనీ, కమల్ హాసన్
తమిళనాడులో ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు ఏవీ కూడా ప్రజల మంచి కోసం పాటు పడటం లేదని, సరైన మార్గంలో నడవటం లేదనే ఆలోచనలో ఉన్న కమల్ హాసన్, రజనీకాంత్ ఏ పార్టీలోనూ చేరకుండా... సొంతగా రాజకీయ పార్టీలు స్థాపించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ తన పార్టీకి ‘మక్కల్ నీది మయ్యం' అనే పేరు పెట్టగా, రజనీకాంత్ పార్టీకి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికి ‘రజనీ మక్కల్ మండ్రమ్' అనే అభిమాన సంఘం పేరుతో రజనీ రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

బరిలో కమల్ హాసన్ పార్టీ
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం' తరుపున తాను పోటీ చేయడంతో పాటు పలువురు అభ్యర్థులను బరిలోకి దించే ఆలోచనలో ఉన్నారు. అయితే రజనీకాంత్ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











