ఇండియన్ 2 యాక్సిడెంట్.. మృతుల కుటుంబాలకు 4కోట్ల సాయం అందించిన శంకర్, కమల్ హాసన్!
ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇండియన్ 2 షూటింగ్ లో ఎవరు ఊహించని విధంగా ఒక ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకులడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. ఇక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రీసెంట్ గా చిత్ర యూనిట్ ఆర్థిక సహాయాన్ని అందించింది. దర్శకుడు శంకర్, కమల్ హాసన్ స్వయంగా బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు.

బిగ్ బడ్జెట్ మూవీ ఇండియన్ 2
కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మూవీ ఇండియన్ 2. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 1996లో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమాను శంకర్ అంచనాలకు తగ్గట్లుగా రూపొందిస్తున్నారు.

బాధిత కుటుంబాలకు 4కోట్ల సాయం
ఇక ఫిబ్రవరి 14న చెన్నై లో ఒక భారీ క్రేన్ ద్వారా షూటింగ్ నిర్వహిస్తుండగా అనుకోకుండా క్రేన్ విరిగిపోయి షూటింగ్ సెట్ పైనే పడింది. ఘటనలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ కృష్ణజ్ ఆర్ట్ అసిస్టెంట్ మధు అలాగే ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇక గురువారం బాధిత కుటుంబ సభ్యులకు చిత్ర యూనిట్ 4కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.

కరోనా వైరస్ కారణంగా ఆలస్యం
నష్టపరిహారం కింద ఎప్పుడో ఆర్థిక సహాయాన్ని అందించాలని అనుకున్న చిత్ర యూనిట్ కరోనా వైరస్ కారణంగా ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక గురువారం FEFSI అధ్యక్షుడు ఆర్కే సెల్వమనితో కలిసి శంకర్, కమల్ హాసన్ కుటుంబ సభ్యులను కలిశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలని అంధించారు. ఇక తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి కుటుంబానికి 90లక్షలను అందించారు. మొత్తంగా నాలుగు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలుస్తోంది.
Recommended Video

తృటిలో తప్పించుకున్న కాజల్, కమల్
షూటింగ్ సెట్ లో ఘటన జరిగినప్పుడు అక్కడే కాజల్ అగర్వాల్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అయితే వారు తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అంతకుముందు షూటింగ్ స్టార్ట్ చేయడానికి నిర్మాతలతో పలు ఇబ్బందులను ఎదుర్కొన్న శంకర్ అనంతరం యాక్సిడెంట్ తో మరిన్ని ఇబ్బందులు ఏసుర్కోవాల్సి వచ్చింది. ఇక షూటింగ్ కి కూడా బ్రేక్ పడింది. పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











