వేలానికి దర్శకుడు గౌతమ్‌మీనన్ ఆస్తి

అధికారుల కథనం మేరకు అడయారు ఇందిరానగర్ మొదటి ప్రధాన రహదారిలో గౌతమ్‌మీనన్‌కు 7,091 చదరపుటడుగుల భూమి ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం ఆ భూమిని తనఖా పెట్టి ఇండియన్‌బ్యాంకు నుంచి ఆయన రుణం పొందారు. చెల్లింపులు సక్రమంగా చెల్లించకపోగా బ్యాంకు నోటీసులకు స్పందించలేదు.
దీంతో చెల్లింపుల చివరి గడువు ముగిసిన 60 రోజుల అనంతరం కూడా స్పందించకపోవడంతో, రుణ మంజూరు సమయంలో వినియోగదారుడు ఆమోదించిన షరతుల మేరకు భూమిని బ్యాంకు స్వాధీనం చేసుకుంది. దాని ధర బహిరంగ మార్కెట్‌లో రూ. 12.26 కోట్లు పలుకుతుందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. 24వ తేదీ వరకు టెండర్లు ఆహ్వానించి ఎక్కువ మొత్తం కోట్ చేసినవారికి ఆస్తిని స్వాధీనం చేస్తామని అధికారులు తెలిపారు.
నాగచైతన్యకి 'ఏ మాయ చేశావె" చిత్రంతో హిట్ ఇచ్చి కెరీర్ ఇచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రం అంటే హీరోలందరికీ ఆసక్తే. అయితే రీసెంట్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్యతో అనుకున్న చిత్రం ఆగిపోయింది. కథ కుదరలేదని మరీ సూర్య ఆ ప్రాజెక్టు ఆపుచేసి,మరో సినిమా ప్రారంభించేసాడు. అంతకుముందు విజయ్ సైతం గౌతమ్ మీనన్ కి హ్యాండ్ ఇచ్చాడు. అయితే గౌతమ్ మీనన్ మాత్రం సూపర్ స్టార్ హీరోతో జత కట్టేందుకు సిద్దమవుతున్నారు. ఆ స్టార్ హీరోనే అజిత్. అజిత్ ఇప్పుడు తమిళనాడులో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఆయన గౌతమ్ మీనన్ ని పిలిచి మరీ ప్రాజెక్టు అప్పచెప్పినట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాతలు ప్రెస్ నోట్ విడుదల చేసి ఖరారు చేసారు.
వరుస చిత్రాలతో అజిత్ వేగాన్ని పెంచుతున్నారు. ఆయన నటించిన 'ఆరంభం' చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. శివ దర్శకత్వంలో 'వీరం'లో నటిస్తూ మరోవైపు ఆయన బిజీగా ఉన్నారు. తాజాగా మరో చిత్రానికి సంతకాలు చేశారు. ఈ సినిమాకు స్టెలిష్ దర్శకుడు గౌతంమీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మాత. మాస్‌స్టెలిష్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











