బయోపిక్ ఆఫర్ పై స్పందించిన క్రికెటర్ నటరాజన్.. ఎందుకు రిజెక్ట్ చేశాడంటే?

బయోపిక్ ప్రాజెక్టులకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందొ గత సినిమాల రిజల్ట్ తోనే అర్ధమయ్యింది. ఎమోషనల్ కంటెంట్ లో మంచి స్ఫూర్తినిచ్చే కథలను ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు కొందరు దర్శకనిర్మాతలు. ఇక చాలా కాలం తరువాత అలాంటి అద్భుతమైన కథ క్రికెటర్ నటరాజన్ జీవితంలో ఉందని అతని బయోపిక్ ను తియ్యాలని కొంతమంది కోలీవుడ్ ప్రముఖులు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆ ఆఫర్స్ పై నటరాజన్ కూడా స్పందించాడు.

తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి..

తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి..

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో నటరాజన్ పేరు మారుమ్రోగిపోతోంది. తమిళనాడులోని ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన ఈ ఫాస్ట్ బౌలర్ చాలా తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు అతని బౌలింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ విజయవంతం కావడానికి అతని పాత్ర ఎంతగానో ఉంది.

కూలీ పని చేసుకునే తండ్రి..

కూలీ పని చేసుకునే తండ్రి..

నటరాజన్ జీవితం అంత సాఫీగా ఏమి కొనసాగలేదు. తండ్రి కూలి పని చేస్తుంటే తల్లి చికెన్ పకోడీలు అమ్ముతూ ఉండేది. వారికి ఆరుగురు సంతానం. ఇంట్లో పడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. అయితే చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి ఉన్న నటరాజన్ బౌలింగ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. టెన్నిస్ బాల్ తోనే అతని ప్రయాణం మొదలైంది. అయితే ఆ తరువాత మెల్లగా ఒక వ్యక్తి కారణంగా క్రికెట్ బాల్ వరకు వచ్చాడు.

అలా మొదటి ఛాన్స్..

అలా మొదటి ఛాన్స్..

రంజి ట్రోపి వరకు అతి కష్టం మీద వచ్చిన నటరాజన్ మొదటి మ్యాచ్ లోనే తన సత్తాను చాటుకున్నాడు. అతని యార్కరర్స్ కు బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేయడం హైదరాబాద్ సన్ రైజర్స్ దృష్టిని ఆకర్షించింది. అయితే అక్కడ భువనేశ్వర్ కుమార్ గాయపడం వల్లే అతనికి ఛాన్స్ వచ్చి క్లిక్కయ్యాడు.

ఆస్ట్రేలియా టూర్ లో కూడా అనుకోకుండా..

ఆస్ట్రేలియా టూర్ లో కూడా అనుకోకుండా..

ఇక ఆస్ట్రేలియా టూర్ లో కూడా అతనికి అనుకోకుండా అవకాశం దక్కింది. వరుణ్ చక్రవర్తి గాయపడడం వలన అతన్ని సెలెక్ట్ చేశారు. మొదటి టీ20లో అతను అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ఆ తరువాత టెస్ట్ లో కూడా సత్తా చాటాడు. ఆస్ట్రేలియా టూర్ విజయవంతంగా పూర్తి కావడంతో నటరాజన్ పాత్ర కూడా ఉంది.

Recommended Video

Udyama Simham Official Theatrical Trailer || KCR Biopic || Filmibeat Telugu
బయోపిక్ ఆఫర్.. రిజెక్ట్ చేసిన నటరాజన్

బయోపిక్ ఆఫర్.. రిజెక్ట్ చేసిన నటరాజన్

నటరాజన్ కెరీర్ చాలా వేగంగా మలుపులు తిరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే అతని జీవితాన్ని బయోపిక్ గా తీయడానికి కొంతమంది దర్శకులు నిర్మాతలు చాలానే ప్రయత్నాలు చేశారట. కానీ తాను సాధించాల్సిన విజయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని అప్పుడే బయోపిక్ తీస్తే బావుండదు అని నట్టు వచ్చిన ఆఫర్స్ ను రిజెక్ట్ చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X