హీరో విజయ్‌ను కలిసిన యంగ్ క్రికెటర్.. చిరకాల కల నెరవేరిందని కామెంట్.!

భారతదేశంలో సినిమాలకు, క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే దానికీ లేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన వారిని ఇక్కడి వాళ్లు దేవుళ్లతో సమానంగా కొలుస్తుంటారు. క్రికెటర్లనూ అదే రితిలో ఆరాధిస్తుంటారు. అందుకే ఏ సినిమా రిలీజ్ అయినా.. ఎప్పుడు క్రికెట్ మ్యాచ్‌ జరిగినా జనాలు కుప్పలు తెప్పలుగా వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు చెందిన ఓ క్రికెటర్.. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ హీరోపై ఉన్న ప్రేమను మరోసారి బయట పెట్టాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు వరుణ్ చక్రవర్తి. తమిళనాడుకు చెందిన ఈ యంగ్ క్రికెటర్‌కు స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ అంటే ఎనలేని అభిమానం. ఈ విషయాన్ని పలుమార్లు వెల్లడించాడు కూడా. ఈ ఐపీఎల్‌లో తన చేతి మీద ఉన్న విజయ్ రూపంలోని టాటూను కూడా బయట పెట్టాడు. తాజాగా తన అభిమాన హీరోను కలుసుకున్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశాడు.

Indian Cricketer Varun Chakravarthy Met Thalapathy Vijay

కొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న వరుణ్ చక్రవర్తి.. చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా తన అభిమాన హీరోతో గంట పాటు సమావేశం అయ్యాడు. అనంతరం దానికి సంబంధించిన పిక్‌ను సోషల్ మీడియాలో వదిలాడు. ఈ సందర్భంగా ఇళయదళపతి విజయ్‌ను కలవడం వల్ల తన చిరకాల కోరిక నెరవేరిందని పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉండగా, విజయ్ ప్రస్తుతం 'మాస్టర్' అనే మూవీ చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X