ఆయన లేనిదే నేను లేననిపిస్తోంది: రంభ
గత ఏడాది ఆయన ఎవరో నాకు తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన లేనిదే నేను లేను అన్నట్లుగా ఉంది జీవితం అంటోంది రంభ. కెనడాకి చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను రంభ ఇటీవల వివాహం చేసుకున్నాక ఆమె భర్తతో కలిసి కెనడా వెళ్లిపోయంది. అయితే నిన్న (శనివారం) పుట్టిన రోజు వేడుకలను తనకు అనుభందం ఉన్న చెన్నైలో జరుపుకోవటానకి రెండు రోజుల క్రితం తన భర్తతో సహా చెన్నయ్ లో అడుగుపెట్టింది. ఆ విషయం గురించి చెబుతూ - నా బర్త్ డే రోజున మావాళ్లతో ఉంటే నేను సంతోషంగా ఉంటానని ఇంద్రన్ ఈ చెన్నై ట్రిప్‌ను ప్లాన్ చేశారు. నా మనసులో ఉన్న కోరికను ఆయన అర్థం చేసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మా పెళ్లయిన తర్వాత చేసుకుంటున్న తొలి పుట్టినరోజు కాబట్టి నాకు చాలా స్పెషల్‌గా ఉంది. ఇప్పుడు నాకు అన్ని విధాలుగా తోడు, నీడగా ఉండటానికి ఇంద్రన్ ఉన్నారు అని చెప్పారు రంభ. తన భర్త ఇంద్రన్ చేస్తున్న వ్యాపారాలకు తన వంతు సహకారాన్ని అందించడానికి రంభ రెడీ అవుతున్నానంది.


Click it and Unblock the Notifications











