ఆ రెండు బ్లాక్ బస్టర్స్ కంటే భిన్నంగా.. స్టార్ హీరోతో సినిమా గురించి యువ దర్శకుడు!
రాజా రాణి వంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో అందరిని ఆకర్షించిన యువ దర్శకుడు అట్లీ ఆ తరువాత తెరకెక్కించిన తేరి, మెర్సల్ చిత్రాలతో ఆశ్చర్యపరిచాడు. ఆ రెండు చిత్రాలతో అట్లీ పేరు మారుమ్రోగింది. అట్లీ మూడోసారి స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ విజయ్ చిత్రం గురించి స్పందించాడు. ఓ విభిన్నమైన కోణంలోకథని రాస్తున్నా. తేరి, మెర్సల్ చిత్రాలకంటే ఈ కథ పూర్తి భిన్నంగా ఉంటుంది అని అట్లీ తెలిపాడు. విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సర్కార్ చిత్రం పూర్తయ్యాక అట్లీ తన చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తేరి, మెర్సల్ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. కేవలం మూడు చిత్రాలతోనే ఈ యువ దర్శకుడు సంచలనంగా మారాడు.


Click it and Unblock the Notifications











